Samantha Health: సమంత పని పూర్తయింది… న్యూయార్క్ ఫ్లైట్ ఎక్కేసింది

మయోసైటీస్ తర్వాత సామ్‌ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి….
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్… ఇక టార్గెట్ బాలీవుడ్. బీ టౌన్‌కిి ఎంట్రీ ఇవ్వాలి. అక్కడ కూడా స్టార్ క్రేజ్‌ తెచ్చుకోవాలి అంటూ సమంత అన్నీ రెడీ చేసుకుంది. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలకు కూడా సైన్ చేసింది. కానీ వీటిన్నింటికీ మయోసైటీస్‌తో బ్రేక్ పడింది. బీ టౌన్‌లో చక్రం తిప్పాలి అనే సామ్ కోరికకు మయోసైటీస్ అడ్డుగా నిలిచింది.

యశోద తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సామ్ ఇప్పుడు ఏకంగా ఆరు నెలలు కెమెరాకి దూరంగా ఉండబోతుంది. కానీ, ఈ బ్రేక్‌కి ముందు సామ్ ముందు ఉన్న బాధ్యత ఖుషి ప్రమోషన్స్. ప్రొడ్యూసర్స్‌తో ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం.. రీసెంట్‌గా మ్యుజిక్ కన్సెెంట్‌లో కనిపించి తన బాధ్యతను తీర్చుకుంది. ఇప్పుడు తన ఫోకస్ మొత్తం మయోసైటీస్ నుంచి పూర్తిగా కోలుకోవడమే. అందుకే న్యూయార్క్ బయలుదేరింది సామ్.

శుక్రవారం రాత్రి సామ్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో దర్శనమిచ్చింది. అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కేసి న్యూయార్క్‌కి వెళ్లిపోయింది. దాదాపు నాలుగు నుంచి ఐదు నెలల పాటు అక్కడే ఉండి మయోసైటిస్‌కి ట్రీట్‌మెంట్ తీసుకోబోతుంది. అంటే సామ్ ఐదు నెలల పాటు మనకు ఇక మనకు కనిపించకపోవచ్చు. మయోసైటీస్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ హైదరాబాద్‌కి వచ్చి తన కెరీర్‌పై ఫోకస్ చేస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు