KushiMusicalConcert : ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ లో అందరు నవ్వుకుంది అక్కడే

KushiMusicalConcert

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా మ్యూజిక్ కన్సర్ట్ నిన్న సాయంత్రం గ్రాండ్ గా జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఖుషి సినిమాలోని టైటిల్ సాంగ్ కు విజయ్ దేవరకొండ సమంతల స్పెషల్ పర్ఫామెన్స్ ఈ ఈవెంట్ కు మేజర్ ప్లస్ అవ్వగా సింగర్ సిధ్ శ్రీరామ్ సాంగ్ పర్ఫామెన్స్ మాత్రం అందరికి నవ్వు తెప్పించింది.

ఇటీవల కాలంలో ప్రి రిలీజ్ ఈవెంట్ కల్చర్ ఎక్కువగా పెరగటంతో మేకర్స్ ఇటువంటి సినిమా మ్యూజిక్ కన్సర్ట్ లు నిర్వహించడం మానేశారు. కానీ లేటెస్ట్ గా ఖుషి సినిమా పాటలు బాగా హిట్ అవడంతో ఈ మూవీ టీం మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించాలనే ఆలోచన వచ్చినట్టు తెలుస్తోంది. హేశం అబ్దుల్ వహబ్ అనే మలయాళ సంగీత దర్శకుడు అందించిన ఖుషి పాటలు ఇటీవల కాలంలో బాగా పాపులర్ అవ్వగా ఖుషి సినిమాలో పాటలు పడిన అందరు సింగర్స్ తో కలిసి ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించడం జరిగింది.

అయితే ఖుషి సినిమాలో బాగా హిట్టైన ఆరాధ్య అనే పాటను తెలుగు, తమిళ్ లో సింగర్ సిధ్ శ్రీరామ్ ఆలపించారు.ఇక ఈ పాటను ఆయనను స్టేజ్ మీద పాడటానికి యాంకర్ సుమ పిలవగా సిధ్ శ్రీరామ్ స్టేజ్ పైకి ఎక్కి.. గీత గోవిందం సినిమా 5 ఇయర్స్ కంప్లిట్ చేసుకున్న సందర్భంగా, మొదటగా ఆ సినిమాలోని ఇంకేం కావాలి అనే పాటతో మొదటపెట్టి, ఖుషి సినిమాలోని ఆరాధ్య పాటతో తన పెర్ఫామెన్స్ ముగించాడు.

- Advertisement -

అయితే ఈ రెండు పాటల మధ్యలో ఆయన డియర్ కామ్రేడ్ లోని విరహం పొంగెనే అనే సాంగ్ ను కూడా ఆయన పాడగా.. ఆ సాంగ్ మధ్యలో ఆడియన్స్ తో సిధ్ శ్రీరామ్ కొన్ని వింత సౌండ్స్ చేయించాడు. దాంతో స్టేడియం అంత ఆ సౌండ్స్ ను అనుకరిస్తుండగా ఈవెంట్ కు వచ్చిన మిగితా గెస్ట్ లంతా తెగ నవ్వుకున్నారు. ఇక ఈవెంట్ వీడియోస్ ను ఈ రోజు ఉదయం మూవీ యూనిట్ యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయగా ప్రస్తుతం సిధ్ శ్రీరామ్ ఆ వింత సౌండ్ క్లిప్స్ ను మిమర్స్ అంత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మిమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఆ వీడియోస్ చూస్తున్న వాళ్లంతా తెగ నవ్వుకుంటూ ఎంటర్టైన్ అవుతున్నారు. దీనిబట్టి చూస్తే ఖుషి మ్యూజికల్ కన్సర్ట్ .. మ్యూజిక్ తో పాటు కామెడీని కూడా ప్రేక్షకులకు అందించిందని చెప్పవచ్చు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు