Bhagavanth Kesari Movie: బాలయ్య మళ్లీ అదే తీరు… కానీ ఈ సారి కాస్త కొత్తగా?

Bhagavanth Kesari Movie

సీనియర్ హీరోల ప్రతి సినిమాల్లో కనిపించేది ఫ్లాష్ బ్యాక్. సినిమా స్టార్ట్ కావడంతోనే సాదాసీదగా కనిపించే హీరోకు ఓ కష్టం వస్తే, ఎలా రియాక్ట్ అవుతాడు? దానికి హీరో ఫ్లాస్ బ్యాక్ లింక్. దీన్నీ మనం జనరేషన్స్ నుంచి తెలుగు స్క్రీన్ పై చూస్తూనే ఉన్నాం. దీనిపై క్రిటిక్స్ నుంచి ఎన్ని రూమర్స్ వచ్చినా, ఇటు సీనియర్ హీరోలు గానీ, కొంత మంది డైరెక్టర్లు గానీ తమ రూట్ ఏ మాత్రం మార్చుకోవడం లేదు.

ఇటీవల భోళా శంకర్ మూవీలో కూడా ఫ్లాష్ బ్యాక్ సీన్ పెట్టారు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. తాజాగా బాలయ్య చేయబోతున్న భగవంత్ కేసరీ మూవీలో కూడా సెకండాఫ్‌లో ఓ ఫ్లాష్ బ్యాక్ సీన్ ను డిజైన్ చేస్తున్నాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్ రోటీన్‌గా కాకుండా కొంత మేర కొత్త దనాన్ని యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ ఫ్లాష్ బ్యాక్‌లో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడట.ఈ పాత్రకు యాక్షన్ టచ్‌తో పాటు ఎమోషనల్ సీన్స్ ను కూడా గ్రిప్పింగ్‌గా ఉండేలా డిజైన్ చేస్తున్నాడట. ఏ మాత్రం బోరు ఫీల్ లేకుండా ఈ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ పవర్ ఫుల్ పాత్ర తన ఐడెంటిటిని మార్చుకుని సాదాసీద జీవితం ఎందుకు గడపాల్సి వచ్చిందో అనే ట్విస్ట్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని సమాచారం.

- Advertisement -

కాగా, ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల (Sreeleela) కనిపించబోతుంది. కూతురు కోసం పోరాడే మధ్య తరగతి తండ్రి అనే కథాంశంతో భగవంత్ కేసరి ఉంటుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా ఫ్లాష్ బ్యాక్ పై వార్తలు రావడంతో బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ కూడా భగవంత్ కేసరి కోసం ఎదురుచూస్తున్నారు.

కాగా భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు