Bhagavanth kesari: శ్రీలీలకు మాస్ ఎలివేషన్స్ ఇచ్చిన బాలయ్య

ప్రస్తుతం టాలీవుడ్ ట్రేండింగ్ హీరోయిన్ శ్రీలీలను నందమూరి బాలకృష్ణ పొగడ్తలతో ముంచేశాడు. ఇటీవలనే ఆయన బసవతారకం ఇరవై మూడవ వార్షికోత్సవ వేడుకలకు హాజరవ్వగా ఈ సందర్భంలో హీరోయిన్ శ్రీలీలపై బాలయ్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

సీనియర్ హీరో, స్టార్ హీరో, జూనియర్ హీరో అనే తేడా లేకుండా అందరితో వరుస సినిమాలో చేస్తూ దూసుకుపోతుంది శ్రీలీల. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్ ఉన్న హీరోయిన్స్ కూడా ప్రస్తుతం శ్రీలీల చేస్తున్నన్నీ సినిమాలు చేయట్లేదనే చెప్పాలి. దాదాపు ఈమె కేవలం తెలుగులోనే 10 సినిమాలలో హీరోయిన్ గా చేస్తూ అందరికన్నా బిజీ హీరోయిన్ గా ఉంటోంది .

శ్రీలీల ప్రధాన పాత్రలో నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తోన్న సినిమా భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ మెయిన్ లీడ్ గా నటిస్తుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవలనే ఈ సినిమాకి సంబంధించి టీజర్ కూడా రిలీజవ్వగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

ఇక బసవతారకంవార్షికోత్సవ వేడుకలకు అతిథిదులుగా విచ్చేసిన హీరోయిన్ శ్రీలీల, పివి సింధు ల గురించి బాలయ్య మాట్లాడుతూ వారిని పొగడ్తలతో ముంచేశాడు చాలా మంది నటులు డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను అంటారు గాని హీరోయిన్ శ్రీలీల మాత్రం నిజంగానే డాక్టర్, ఒక పక్క డాక్టర్ కోర్సు చేస్తూ మరో పక్క సినిమాలలో నటిస్తుంది. శ్రీలీల పదహారణాల తెలుగమ్మాయి మాత్రమే కాదు పదహారణాల డాక్టర్ అని శ్రీలీల గురించి ఆయన మాట్లాడగా ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు