Naga Mahesh: సమంత చెయ్యి పట్టుకున్నా.. ఆమె రియాక్షన్ ఏంటంటే?

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూనే సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఖుషీ చేస్తోంది. సమంత కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాలలో రంగస్థలం కూడా ఒకటి. ఈ సినిమాలో సమంత డీ గ్లామరస్ గా కనిపించి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సమంత తండ్రి పాత్రలో నాగ మహేష్ నటించడం జరిగింది. తాజాగా నాగ మహేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రంగస్థలం సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఖైదీ నెంబర్-150 సినిమాలో తాను నటించడం వల్ల ఆ నటన చూసి సుకుమార్ తనకు అవకాశం ఇచ్చారని రంగస్థలం సినిమా తనకు రెండవ సినిమా. అది కూడా మంచి రోల్ ఇవ్వమని అడగగా ఆ రోల్ ఇచ్చారని నాగ మహేష్ తెలియజేశారు.. అయితే రంగస్థలం సినిమాలో మొదట తనకు ఇన్స్పెక్టర్ పాత్రలో అవకాశం ఇచ్చారని.. ఆ తర్వాత రోల్ మార్చినట్టు సుకుమార్ తెలిపారు. సుకుమార్ తనకు ఎలాంటి హోం వర్క్ కూడా ఎప్పుడూ ఇవ్వలేదని అన్నారు.

ఈ సినిమాలో తనని కేవలం తాగుబోతు పాత్రలో చూపించారని.. సమంతాకు తనకు తానే పరిచయం చేసుకున్నానని.. తెలిపారు. ఒక సన్నివేశంలో భాగంగా సమంత చెయ్యి పట్టుకుని లాగాల్సిన సన్నివేశం ఉందని.. అయితే ఆ సీన్ చేయడానికి కాస్త భయపడినట్టు తెలిపారు. కానీ సమంత తన దగ్గరికి వచ్చి గట్టిగా పట్టుకోండి.. పర్వాలేదని చెప్పి.. ఆ సీన్ ని బాగా వచ్చేలా చేసిందని వివరించారు. రంగస్థలం సినిమా షూటింగ్ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా కలిసి షూటింగ్ సెట్ లో పాల్గొనే వారమని.. అందరూ కూడా ఎలాంటి భేదాలు లేకుండా కలిసి నటించామని చెప్పుకొచ్చారు.

- Advertisement -

కానీ ఒక స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కూడా సమంత అలా చెప్పడంతో తాను షాక్ లోకి వెళ్లిపోయానని తెలిపారు.. అలాగే భరత్ అనే నేను సినిమాలో కూడా మంచి రోల్ లో నటించానని, కానీ కొన్ని సన్నివేశాలు ఎడిటింగ్లో కట్ అయిపోయాయని తెలిపారు. ఇవే కాకుండా చాలా చిత్రాలలో తాను నటించి మంచి పేరు సంపాదించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే ప్రస్తుతానికి తనకు మంచి రెమ్యూనరేషన్ కూడా వస్తుందని చెప్పొకొచ్చారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు