Rajamouli: మహేష్ మూవీ కోసం భారీ తారాగణం.. వర్క్ అవుట్ అవుతుందా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. ఇక ఆయన తీసిన ప్రతి సినిమా కూడా ఆయనకు మంచి పేరును తీసుకురావడమే కాదు తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచింది. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకుందని చెప్పవచ్చు. అంతేకాదు ఆస్కార్ కి కూడా నామినేట్ అయింది. ఇక అందుకే ఆయనతో సినిమాలు చేయాలని స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారు రాజమౌళి.

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్న ఈయన.. ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో మరొకసారి హాలీవుడ్ లో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇందులో మహేష్ బాబు అడ్వెంచర్లు కూడా చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాదు రాజమౌళి ఇప్పటివరకు తీసిన సినిమాల కంటే ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇప్పుడు భారీ తారాగణం ఎంటర్ అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరో విక్రమ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

అయితే విక్రమ్ ఇందులో విలన్ పాత్రలో కనిపించనున్నారా లేక ఏదైనా ఒక చిన్న పాత్ర లో చేస్తారా అన్నది ఇంకా తెలియలేదు. అయితే ఈ సినిమాలో మాత్రం తప్పకుండా ఆయనకు ఒక క్యారెక్టర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ విషయం తెలిసి అందరూ ఇందులో విక్రమ్ నటిస్తే విశ్వరూపం చూపిస్తాడని కామెంట్లు చేస్తున్నారు. ఇక రాజమౌళి సినిమాలలో నటులు తమదైన రీతిలో రెచ్చిపోయిన నటిస్తూ ఉంటారు.. మరి అలాంటిది నటనకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విక్రమ్ ఏ రేంజ్ లో నటిస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా వేరే సినిమాలలోనే ఇంత అద్భుతంగా తన నటన కనబరిచే విక్రమ్.. ఇక రాజమౌళి సినిమాలో ఏ రేంజ్ లో తన నటన చూపిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ప్రస్తుతం ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇక అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు