Maheshbabu: భార్యను ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పిన మహేష్.. కామెంట్స్ వైరల్..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హైదరాబాదులోని మల్లారెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ కి మహేష్ బాబుతో పాటు రాజమౌళి కూడా ముఖ్య అతిథులుగా హాజరవడం జరిగింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా డిసెంబర్ ఒకటో తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఈ వేడుకను నిర్వహించడం జరిగింది.

ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమంలో మహేష్ బాబు చేసిన కామెంట్లు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయి. అంతేకాదు భార్యలను ఎలా హ్యాండిల్ చేయాలన్న విషయాన్ని కూడా మహేష్ బాబు నుంచి సుమా బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఇకపోతే మరొకవైపు రిపోర్టర్లు కూడా కొన్ని ప్రశ్నలను మహేష్ బాబును అడగగా ఆయన ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. మీ తండ్రి కృష్ణ గారు ఎప్పుడైనా మీపై కోప్పడిన సందర్భాలు ఉన్నాయా అని అడగగా.. ఆయన సమాధానం చెబుతూ అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. అయితే ఈ సినిమాలో చూపించిన విధంగా ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అయితే నేను చూడలేదు అంటూ మహేష్ బాబు స్పష్టం చేశారు. మరొక మీడియా ప్రతినిధి మహేష్ బాబును ప్రశ్నిస్తూ భార్యను మేనేజ్ చేయడానికి మీరు ఏమైనా కొన్ని టిప్స్ చెప్పగలరా అంటూ ప్రశ్నించగా మహేష్ బాబు ఆసక్తికరమైన సమాధానం తెలిపారు.

భార్యలను మేనేజ్ చేయాలంటే పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.. భర్తలు ఎప్పుడు నవ్వుతూ ఉంటే చాలు సందర్భం ఏదైనా నవ్వుతూ ఉండండి. ఇక వారిని మేనేజ్ చేయడానికి అదొక్కటే మంత్రం అంటూ ఈ సందర్భంగా మహేష్ బాబు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతూ బహుశా మహేష్ బాబు, నమృతను ఇలాగే మేనేజ్ చేస్తారేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా భర్తలూ భార్యతో గొడవ పడకూడదు అంటే మీరు కూడా మీ భార్యల దగ్గర ఎప్పుడూ నవ్వుతూనే ఉండండి..

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు