Sandeep Reddy Vanga : మా హీరోలకు ఏందీ భయ్యా ఈ టార్చర్… ఈ డైరెక్టర్ నిజంగానే ‘యానిమల్’

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరి ఇంత దారుణంగా ఉంటాడా? హీరోలను అంతలా టార్చర్ చేస్తాడా? వాళ్ళు బాధ పడుతుంటే రాక్షసానందం పొందుతాడా? అనే విషయం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో “యానిమల్” అనే మూవీ థియేటర్లలోకి రానున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న,హీరోయిన్ గా, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా, మరో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే రిలీజైన ‘యానిమల్’ ట్రైలర్ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ‘యానిమల్’ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు దిగ్గజ దర్శకుడు రాజమౌళితో పాటు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా గెస్ట్ గా హాజరయ్యారు. ఈ క్రమంలోనే మహేష్ బాబును సందీప్ రెడ్డి కావాలనే టార్చర్ చేశాడని టాక్ నడుస్తోంది. అసలు విషయంలోకి వస్తే సోషల్ మీడియాలో సందీప్ రెడ్డి వంగాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతుంది. సందీప్ తన సినిమాలను రిజెక్ట్ చేసిన హీరోలనే, ఆ సినిమా ఈవెంట్లకు పిలుస్తూ టార్చర్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. గతంలో ఆయన ఫస్ట్ మూవీ విషయంలో జరిగిన స్టోరీని మరోసారి నెమరేసుకుంటున్నారు.

తాజాగా “యానిమల్” మూవీని చేయడానికి మహేష్ బాబు నిరాకరించాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న అదే మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబును గెస్ట్ గా పిలిచాడు. గతంలో కూడా ‘అర్జున్ రెడ్డి’ మూవీతో సాలిడ్ హిట్ కొట్టి, ఆ మూవీని రిజెక్ట్ చేసిన శర్వానంద్ ను యాడ్ మూవీ ఈవెంట్ కు గెస్ట్ గా పిలిచాడు. ఇలా తన స్టోరీలను రిజెక్ట్ చేసిన హీరోలను, ఆ మూవీకే గెస్ట్ గా పిలిచి టార్చర్ చేస్తున్నాడని అంటున్నారు. ఈ విధంగా తనతో మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు ఆ తరువాత సందీప్ మూవీని ఎందుకు రిజెక్ట్ చెశాంరా దేవుడా అని జెలస్ ఫీల్ అయ్యేలా చేస్తున్నాడన్న మాట. మా హీరోలకు ఏందీ భయ్యా ఈ టార్చర్… ఈ డైరెక్టర్ నిజంగానే ‘యానిమల్’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు