Nithin: శ్రీలీలను అంత మాట అనేసిన నితిన్.. ఏంది బ్రో ..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి వరకు సినిమాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈమె తాజాగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో సినిమా చేసి డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల విడుదలైన ఆదికేశవ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. దీంతో అందరి చూపు ఆమె తదుపరి నటిస్తున్న “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ “సినిమా పైనే.. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.

డిసెంబర్ 8వ తేదీన విడుదలకు సిద్ధం కాబోతున్న నేపథ్యంలో తీరిక లేకుండా ప్రమోషన్స్ లో గడుపుతున్నారు హీరో నితిన్. హీరో నితిన్ ఈ సినిమాలో శ్రీ లీల పాత్ర పై పలు షాకింగ్ కామెంట్లు చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో శ్రీ లీల పాత్ర ఎలా ఉండబోతోంది అని రీసెంట్ ఇంటర్వ్యూలో అడగగా.. దానికి నితిన్ సమాధానం ఇస్తూ.. ఒక కమర్షియల్ సినిమాలో హీరో.. హీరోయిన్ గా నటిస్తే సినిమా హిట్ అయితే పేరు వస్తుంది. ఇక ఈ సినిమాలో శ్రీ లీలా కూడా అంతే ఉంటుంది. ఆమెది గొప్ప పాత్ర అని నేను చెప్పను.. అయితే నాలుగు పాటలు , నాలుగు ఫైట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆమె కనిపిస్తుంది అంటూ తెలిపారు.

ఇక నితిన్ మాటలను బట్టి చూస్తే ఇందులో శ్రీలీల పాత్రకి పెద్దగా స్కోప్ లేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇకపోతే చాలాకాలం తర్వాత తనకు తగ్గ సబ్జెక్టుని ఎంచుకున్నాడు. ఈ సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉండనున్నట్టు తెలుస్తోంది.అంతేకాదు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ట్రైలర్ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు. అటు ఈ సినిమా పైన ఆయన అభిమానులు కూడా భారీ హోప్స్ పెట్టుకున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమాతో నితిన్ ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తాడో చూడాలి. ఒకవేళ ఈ సినిమా కనుక మంచి సక్సెస్ అయితే ఇక ఆయన కెరియర్ మళ్ళీ దారిలోకి వస్తుందని చెప్పవచ్చు.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు