Sree Leela: అలాంటి మగాడి భర్తగా కావాలి !

శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో మార్మోగుతున్న పేరు. ఈ భామ ప్రస్తుతం ఓ పది సినిమాల్లో నటిస్తూ సూపర్ బిజీగా ఉంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది కన్నడ అందం శ్రీలీల. ఓకే సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ఆ తర్వాత శ్రీలీల రవితేజ సరసన ధమాకాలో నటించి మరో హిట్ ను అందుకుంది.

ఇక తాజాగా శ్రీలీల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరిలో నటించి మరో బంపర్ హిట్ ను అందుకుంది. ఇక ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన తొలిసారి కాజల్ అగర్వాల్ నటించింది. శ్రీలీల మరో ముఖ్య పాత్రలో కనిపించింది. ఇక ఇది ఇలా ఉంటే….. ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీలకు కాబోయే భర్త ఎలా ఉండాలి…? ఆయనకు క్వాలిటీస్ ఏ విధంగా ఉండాలి…..?అంటూహోస్ట్ ప్రశ్నించారు.

దీంతో శ్రీలీల ముఖ్యంగా మూడు క్వాలిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటూ చెప్పుకొచ్చింది. మొదటి క్వాలిటీ నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే అబ్బాయికి చాలా గట్స్ ఉండాలని తెలిపింది. నా విష్ లిస్ట్ చాలా పెద్దదే ఉంది…. నాకు కాబోయే భర్త మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగి ఉండాలని స్పష్టం చేసింది. కనిపించే విధంగా అందంగా, పద్ధతిగా ఉండాలని వివరించింది శ్రీలీల. దీంతో శ్రీలీల చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు