Anil Ravipudi:భగవంత్ కేసరి మూవీలో మిస్టేక్… సారీ చెప్పిన డైరెక్టర్ అనిల్ రావిపూడి

నందమూరి నటసింహం బాలయ్య నటించిన భగవంత్ కేసరి చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి స్రుష్టిస్తుంది. లియో, టైగర్ నాగేశ్వరరావు వంటి పాన్ ఇండియా సినిమాలు ఉన్నా దసరా విన్నర్ గా బాలయ్య నిలుస్తున్నాడు. మొదటి రోజే 32 కోట్లు కలెక్ట్ చేసింది ఈ చిత్రం. బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ వీకెండ్స్, తర్వాత పండగ సీజన్ లో మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. కాగా, ఈ విజయాన్ని చిత్ర యూనిట్ సెలబ్రెట్ చేసుకుంటుంది. శుక్రవారం చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెట్టి, తమ సినిమాను ఆదరిస్తున్న ఆడియన్స్ కు ధన్యవాదాలు కూడా తెలిపారు.

అయితే ఈ సినిమాలో చిన్న మిస్టేక్ ఉంది. దీనికి డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా స్పందించి, క్షమాపణలు చెప్పాడు. ఆ మిస్టేక్ ఏంటంటే… సినిమాలో శరత్ కుమార్ జైలర్. కానీ, ఆక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత టీవీల్లో సీఐ మరణం అంటూ న్యూస్ వస్తుంది. ఒక జైలర్ ను సీఐ అని అంటూ చూపించారు. ఇదే విషయాన్ని శుక్రవారం నాటి ప్రెస్ మీట్ లో ప్రస్తావనకు వచ్చింది.

వెంటనే డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించి… ఇంత పెద్ద కమర్షియల్ సినిమాలో ఇలాంటి చిన్న మిస్టేక్స్ గమనించడం పెద్ద విషయమే. నిజానికి శరత్ కుమార్ జైలరే. కానీ, అక్కడ సీఐ అని కనిపించడం తమ మిస్టేకే అంటూ సమాధానం ఇచ్చాడు. అంతే కాదు, ఈ పొరపాటు తనదే అంటూ ఆడియన్స్ కు క్షమాపణలు కూడా చెప్పాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అర్థం పర్థం లేని సన్నివేశాలు పెట్టి, ప్రేక్షకులకు ఇష్టం ఉంటే చూస్తారు లేకుంటే చూడరు అని అనుకునే డైరెక్టర్లు ఉన్న ఈ రోజుల్లో, ఆ చిన్న మిస్టేక్ కు కూడా క్షమపణలు చెప్పడం నిజంగా గ్రేట్ అంటూ అనిల్ రావిపూడిని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు