Rajinikanth’s Film: నెల్సన్ కి కొట్టాడు , లోకేష్ కొట్టాలి

తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్స్ అంటే టక్కున గుర్తొచ్చేది నెల్సన్, లోకేష్ కనగరాజ్, అట్లీ. వీళ్లు ముగ్గురు ఎందుకు గుర్తొస్తారు అంటే ఇళయ దళపతి విజయ్ తో సినిమాలు చేసిన అనుభవం వీళ్లకు ఉంది. ఇళయ దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఎంత స్టార్ డం ఉంటుందో తమిళ్లో విజయ్ కూడా అంతే స్టార్డమ్ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.

ఇంకా అట్లీ విషయానికి వస్తే ఇళయ దళపతి విజయ్ తో మూడు సినిమాలు చేశాడు. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ తో జవాన్ హిట్ కొట్టి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే నెల్సన్ కూడా రీసెంట్ గా జైలర్ తో హిట్ కొట్టి మంచి హిట్ అందుకున్నాడు.

జైలర్ కంటే ముందు నెల్సన్ చేసిన సినిమా “బీస్ట్”. వరుణ్ డాక్టర్ సినిమా తర్వాత విజయ్ తో నెల్సన్ సినిమా అంటే అందరూ ఎక్స్పెక్టేషన్స్ హై లో పెట్టుకున్నారు. కానీ వాటిని బీస్ట్ సినిమా అందుకోలేకపోయింది. బీస్ట్ ఫెయిల్యూర్ నుంచి కం బ్యాక్ ఇచ్చి జైలర్ తో అద్భుతమైన విజయాన్ని సాధించాడు నెల్సన్.

- Advertisement -

ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తుంది అని అంటే ప్రస్తుతం అదే రేంజ్ లో హిట్టు సాధించాల్సి ఉంది లోకేష్ కనగరాజ్. నగరం సినిమాతో దర్శకుడుగా పరిచయమైన లోకేష్ కెరియర్లో అన్ని సినిమాలు కూడా మంచి పేరు సాధించినవే. కానీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన విక్రమ్ సినిమా లోకేష్ కనకరాజ్ పై అంచనాలను పెంచి, ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా చేసింది.

అంత సక్సెస్ తరువాత విజయ్ తో సినిమా చేస్తున్నాడు లోకేష్ కనకరాజ్ అని తెలియగానే, అందరికీ లియో సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో పెరిగిపోయాయి. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన లియో సినిమా మిశ్రమ స్పందనను అందుకుంటుంది. దాదాపుగా ఈ సినిమాపై అందరూ అసంతృప్తిగా ఉన్నారు.

ఇప్పుడు రజినీకాంత్ సినిమా చేయనున్నాడు లోకేష్ కనగరాజ్. నెల్సన్ కం బ్యాక్ ఇచ్చినట్టు మళ్ళీ రజినీతో లోకేష్ కనగరాజ్ కం బ్యాక్ ఇవ్వాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ ఫెయిల్యూర్ ను లోకేష్ తట్టుకొని మళ్లీ ఎలాంటి సక్సెస్ కొడతాడు అనేది చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు