Lokesh Kanagaraj : లియో ట్రైలర్ లో అది మిస్ అయింది

ఇటీవల కాలంలో వరుస సూపర్ హిట్ సినిమాలతో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు లోకేష్ కనకరాజ్. ఈ డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఆన్ లైన్ లో మరియు ఆఫ్ లైన్ లో విపరితమైన హడావిడి స్టార్ట్ అవుతుండటం చూస్తూనే ఉన్నాం. ఇక లేటెస్ట్ గా చూస్తే లోకేష్ కనకరాజ్ దళపతి విజయ్ తో లియో అనే సినిమా చేస్తున్నాడు. సీనియర్ నటి త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, గౌతమ్ మీనన్, అర్జున్ దాస్ తదితరుల ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న ఈ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితమే రిలీజ్ అయింది.

ఇక ఈ లియో సినిమా ట్రైలర్ రెస్పాన్స్ విషయానికొస్తే ఈ ట్రైలర్ కొంతమంది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంటే మరికొంత మందికి మాత్రం ఏమాత్రం నచ్చలేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ట్రైలర్ నచ్చని వాళ్ళు విజయ్ కు యాంటీ ఫ్యాన్స్ అయ్యుంటారనుకుందామనుకుంటే ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే లియో సినిమా ట్రైలర్ నచ్చని వాళ్లలో ఎక్కువ మంది విజయ్ అభిమానులే ఉన్నారు.

అయితే మరీ ఒక సెక్షన్ ఆఫ్ విజయ్ అభిమానులకు లియో ట్రైలర్ నచ్చి మరి కొంత మందికి ట్రైలర్ నచ్చకపోవడానికి కారణం మరేదో కూడా కాదు ట్రైలర్ లో రెగ్యులర్ గా లోకేష్ కనకరాజ్ సినిమాలో కనిపించే అంశాలు పెద్దగా లేకపోవడమే అని తెలుస్తోంది. సాధారణంగా లోకేష్ సినిమాలలో హీరోలకు ఒక కొత్త రకం ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. ఇక ఆ సీన్స్ వాళ్లే ప్రేక్షకులు ఆయన సినిమాలంటే ఇష్టపడుతుంటారు. కానీ లియో ట్రైలర్ చూస్తే ఆ రేంజ్ మాస్ ఎలివేషన్ సీన్స్ ఏమి లేవు.. అలాగే ట్రైలర్ లోనే మొత్తం కథ కూడా చెప్పేసినట్టయింది.

- Advertisement -

ఇక షాట్స్ కూడా లోకేష్ గత సినిమాలోగా స్టైలిష్ గా లేవు. ఇక సినిమా డైలాగ్ ల గురించైతే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనే లాగే ఉంది. ఇక దీనిబట్టి చూస్తే గత కొద్దీ రోజులుగా లియో పోస్టర్స్ క్రియేట్ చేసిన బజ్ అంత కాసేపటి క్రితం రిలీజ్ చేసిన ట్రైలర్ తో పోయిందనే చెప్పాలి. విజయ్ ఇటీవల కాలంలో చేసిన సినిమాలలో వచ్చిన ట్రైలర్స్ లో లియో ట్రైలర్ చాలా వరకు వీక్ గా ఉండనే వాదన మాత్రం బలంగా వినిపిస్తోంది. మరీ కేవలం ట్రైలర్ కె ఇంత నెగిటివిటి మూటగట్టుకున్న లియో థియేటర్స్ ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు