34YearsOfShiva: క్లాప్ బోర్డు కొట్టడం రానోడు , ఇండస్ట్రీ దశ దిశ మార్చేశాడు

ఒక కుర్రాడికి తన కాలేజీ డేస్ అయిపోయాక, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తాజ్ కృష్ణ అనే ఒక హోటల్ లో జాబ్ ఇప్పించాడు. అక్కడ ఆ కుర్రాడికి వచ్చే జీతం తక్కువ. పైగా ఆ కుర్రాడికి సినిమా అంటే ఇంట్రెస్ట్. అప్పటికి వాడి దురదృష్టవశాత్తు పెళ్ళి కూడా జరిగిపోయింది. ఈ సినిమా పిచ్చి వలన ఎప్పుడు సినిమా డిస్కషన్స్ పెడుతుండేవాడు. అది వాళ్ళ ఆవిడకి ఇష్టం ఉండేది కాదు.

సో ఇలా కాదు అని చెప్పి రామోజీరావు గారు ప్రతిఘటన, శ్రీవారికి ప్రేమలేఖ లాంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మిస్తున్న తరుణంలో,
“ద ఐడియాస్ థట్ కిల్డ్ థర్టీ మిళియన్ పీపుల్” అనే ఒక ఆర్టికల్ రాసాడు.
ఫెడ్రిక్ నిషే రాసిన కొన్ని పుస్తకాలు హిట్లర్ ని ప్రభావితం చేయడానికి గల కారణాలు ఏంటి అనేది ఆ ఆర్టికల్ సారాంశం. మొత్తానికి ఆర్టికల్ చదివి ఈ కుర్రాడిని రామోజీరావు పిలిపించారు. అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఈ కుర్రాడు సినిమా తీస్తా అనగానే, నువ్వు ఇది రాసినందుకు కొలామిస్ట్ గా జాబ్ ఇస్తా.. కానీ సినిమా అవకాశం ఎలా ఇస్తా అన్నారు. ఆ ప్రాసెస్ లో సురేష్ బాబును కూడా కలవడం. ఆయన రిజక్ట్ చెయ్యడంతో, చివరగా బ్రతుకుతెరువు కోసం అమీర్ పేట్ ఏరియాలో ఒక వీడియో లైబ్రెరీ షాప్ ను పెట్టుకున్నాడు.

మెల్లగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆ షాప్ కి రావడం మొదలెట్టారు.
అలా మెల్లగా ఆ కుర్రోడికి అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున పరిచయమయ్యారు. ఇంగ్లీష్ సినిమాలు చూడటం, బాగా ఇంగ్లీష్ మాట్లాడటంతో ఈ కుర్రోడికి కథలు చెప్పే అవకాశం ఇచ్చారు.
అప్పటికే మనోడిని Exorcist, Evil Dead లాంటి సినిమాలు బాగా ప్రభావితం చేయడంతో “రాత్రి” అనే ఒక కథను చెప్పాడు. ఏదైనా హీరో కథ రాయొచ్చు కదా అని చెప్పారు అక్కినేని వెంకట్.

- Advertisement -

వెంటనే ఈ కుర్రాడు ఇంటికెళ్లి పంజాగుట్ట లోని అప్పట్లో ఉండే ఒక దాదా కథను, ఈ కుర్రోడి కాలేజ్ ఎక్స్పీరియన్స్ కలిపి ఒక 20 నిముషాలు రాసాడు. The Way of the Dragon అనే ఒక బ్రూసిలి సినిమా కథలోని రెస్టారంట్ కి బదులు కాలేజ్ క్యాంటీన్ గా మార్చి కథను రాసాడు.
ఆ కథ పేరు “శివ”. రాసిన ఆ కుర్రోడి పేరు “రామ్ గోపాల్ వర్మ”.
నేటికి 34 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆ “శివ” సినిమాయే, వర్మను ఒక సంచలన దర్శకుడిని చేసింది.

తను అప్రంటీస్ గా పనిచేసిన ఒక సినిమాకి క్లాప్ కొట్టడం రాని వర్మ.. కంటిన్యూటీ బుక్ ని పడేసిన వర్మ.. తన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీని కెలికి పడేసాడు. ఎంతలా అంటే శివ సినిమాకి ముందు.. శివ సినిమా తరువాత అనేంతలా. సినిమా రిలీజ్ అయ్యాక విజయవాడ లో కొందరు సైకిల్ చైన్ లు పట్టుకుని తిరిగేంతలా.. రీసెంట్ గా అర్జున్ రెడ్డి లాంటి హిట్ సినిమా వస్తే, అప్పట్లో శివ ఇప్పట్లో అర్జున్ రెడ్డి అనేంతలా.

ప్రతి హీరో కెరియర్ లో ఎన్ని హిట్ సినిమాలు వచ్చినా..
స్టార్ డం ను తీసుకొచ్చే సినిమా ఒకటి ఉంటుంది.
ఆ సినిమాతో వాళ్ళ స్థాయి అమాంతం పెరిగిపోతుంది.
అలా నాగార్జున కెరియర్ లో వచ్చిన శివ సినిమా ఒక సంచలనం.
అప్పటివరకు ఒక మూసలో సాగే తెలుగు సినిమాని
రామ్ గోపాల్ వర్మ అనే ఒకడు వచ్చి పరుగులు పెట్టించాడు.
తెలుగు సినిమా దిశ, దశ రెండింటిని మార్చేశాడు.
అందరు సినిమా రూల్స్ ను బ్రేక్ చేసాడు అంటారు.
కానీ నాకు అప్పటికి రూల్సే తెలియవు అంటాడు వర్మ.
అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే, “శివ” సినిమాతో ఒక తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాడు అనేది నిజం.
ఇండస్ట్రీ లో పుట్టగొడుగుల్లా డైరెక్టర్లు ఆయన వలనే పుట్టుకొచ్చారు అనేది కూడా నిజమే.

ఏదేమైనా అతి తక్కువ వయసులోనే బీభత్సముగా సినిమాలు చూస్తూ..
ఫెడ్రిక్ నిషే, అయాన్ రాండ్, ఓషో లాంటి వాళ్ళ పుస్తకాలను చదవడం కూడా వర్మ కి ఒక రకంగా ప్లస్ అయింది. అంతటి సంచలన దర్శకుడు ఇప్పుడు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అతడితో, మాటలతో మనం సరిపోలేము. ఎందుకంటే మనం అర్గ్యూ చేస్తాం.. వర్మ లాజిక్ తో కూడిన ఆర్గ్యుమెంట్ చేస్తాడు అది డిఫరెన్స్.

#34YearsOfShiva

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు