LEO trailer talk : లియో ఒక్కడు కాదు ఇద్దరు

అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమా లియో ట్రైలర్ కాసేపటి క్రితమే రిలీజ్ అయింది. దళపతి విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పటికే లియో సినిమాకు సంబంధించి రిలీజైన పాటలు, టీజర్ పోస్టర్స్ సినినిమాపై ఒక రేంజ్ బజ్ క్రియేట్ చేయగా లియో ట్రైలర్ కొద్దీ నిమిషాల ముందే విడుదల చేసారు మేకర్స్.

ఇక ట్రైలర్ విషయానికొస్తే అందరు ముందు నుంచి ఊహించిన విధంగాగే లియో ట్రైలర్ టాప్ నాచ్ క్వాలిటీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దళపతి విజయ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో విజయ్ డబుల్ యాక్షన్ చేస్తునట్టు తెలుస్తుంది. ఇక విజయ్ సరసన హీరోయిన్ త్రిష నటించింది. యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్, గౌతమ్ మీనన్, అర్జున్ దాస్ తదితరులు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక ఎప్పటిలాగే లియో ట్రైలర్ లో అనిరుద్ మ్యూజిక్ అందరిని మెస్మరైజ్ చేసింది.

- Advertisement -

డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అతని సినిమాటిక్ యూనివర్స్ కు సంబంధించి చాలా విషయాలను లియో సినిమాలో పొందుపరిచినట్టు తెలుస్తుంది. కానీ ఆ విషయాలేవీ ఆయన ట్రైలర్ లో చూపించకపోవడం గమనార్హం. ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిన లియో ట్రైలర్ మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో చాలా ప్రామిసింగ్ ఉంది. యాక్షన్ ప్రధానంగా ఉండబోతున్న ఈ సినిమా దసర కానుకగా అక్టోబర్ 19 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవడానికి సిద్ధమవుతోంది.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు