Anupama Parameswaran: రామ్ తో అనుపమ పెళ్ళి.? క్లారిటీ ఇచ్చిన తల్లి.!

అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ లో నిన్న మొన్నటివరకు ఓ ఊపు ఊపిన ఈ భామ.. సడన్ గా రేసులో వెనకబడింది. ప్రస్తుతం సినిమాల్లో మెయిన్ హీరోయిన్ కాకుండా క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న ఈ భామకు కార్తికేయ 2 సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది.

అనుపమ పరమేశ్వరన్ మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. తర్వాత మన తెలుగు హీరోల సరసన చేస్తూనే ఉంది. టాలీవుడ్ ఎనర్జిటిక్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేనితో అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో పడిందని… ఇద్దరు పీకల్లోతు ప్రేమను మునిగిపోయారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ ఒకటవ్వాలని కూడా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ప్రేమించుకోవడమే కాదు ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఓ వార్త కూడా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. వీళ్ళిద్దరూ విడివిడిగా పదుల సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు మాత్రం రెండే. రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్ పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో షికారు చేయడంతో నటి తల్లి స్పందించింది. ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ తల్లి సునీత ఇదంతా పుకార్లని…. తప్పుడు వార్త అంటూ కొట్టి పారేసింది.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు