#NTRNeel: అప్డేట్ తోనే గూస్ బమ్స్ తెప్పిస్తున్న ప్రశాంత్ నీల్

కెజియఫ్ సినిమాతో ఇండియన్ కమర్షియల్ సినిమాలోనే కొత్త ఒరవడిని తీసుకొచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ గురించి అందరికి తెలిసిందే. హీరోల ఎలివేషన్ స్పెషలిస్ట్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండే ఈ డైరెక్టర్ ఆయన సినిమాలతో మాత్రమే కాకుండా సినిమా అప్డేట్స్ తో కూడా ప్రేక్షకులకు గూస్ బమ్స్ తెప్పిస్తున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్.. ఈ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్న విషయం విధీతమే . ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసారు.

అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు. రిలీజ్ ఎప్పుడు ఉంటుందనే విషయంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో బేతాళ ప్రశ్నలు చాలానే ఉన్నాయి. అలాగే వీటన్నింటికి తోడు సలార్ సినిమా రెండు పార్ట్స్ గా రాబోతుండటంతో ఎన్టీఆర్ సినిమా మరింత లెట్ అయ్యే ఛాన్స్ ఉందని అందరు ఫిక్స్ అయిపోయారు.

- Advertisement -

అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేసేలా ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించి మ్యాసివ్ అప్డేట్ ను కాసేపటి క్రితమే ఎనోన్స్ చేసారు మేకర్స్. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ల సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ అవబోతుందని కాసేపటి క్రితమే మైత్రి మూవీస్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది.

అలాగే ఇండియన్ సినిమాలలోనే ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోయే సినిమా బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందని ట్యాగ్ ను జతపరిచింది. ఇక దీనిబట్టి చూస్తే స్క్రిప్ట్ పరంగా మూవీ యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది.కేవలం రెండు మాటల ఈ అప్డేట్ తోనే ఎన్టీఆర్ సినిమాపై మరింతగా హైప్ ను క్రియేట్ చేసారని చెప్పవచ్చు. సినిమా షూటింగ్ మొదలవకుండానే హడావిడి ఈ రేంజ్ లో ఉంటె ఇక మూవీ రిలీజ్ తరువాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు