Ram charan: ఆ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా – కన్ఫామ్ ఐతే బాక్స్ ఆఫీస్ లెక్కలు మారిపోతాయి

ఒక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియకపోయిన అనూహ్యంగా వచ్చిన ఈ న్యూస్ఒక్కసారిగా నెట్ లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అయితే మరి అంతగా వైరల్ అవుతూ, సంచలనం సృష్టిస్తున్న ఆ న్యూస్ ఏంటా అని అనుకుంటున్నారా.. ఆ న్యూస్ ఏంటంటే బాలీవుడ్ సెన్సేషనల్ డైరక్టర్ రాజ్ కుమార్ హిరానీ తో రామ్ చరణ్ తేజ్ సినిమా చేయబోతున్నాడట. కొద్దీ రోజుల క్రితమే ఈ ఇద్దరు ముంబై లోని ఒక రెస్టారెంట్ లో కలిసినట్టు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక డైరక్టర్ రాజ్ కుమార్ హిరానీ షారుఖ్ ఖాన్ తో డంకి సినిమా చేస్తున్నాడు. అయితే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న డంకి సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఆయన డంకి సినిమా రిలీజ్ తరువాత రాజ్ కుమార్ హిరానీ రామ్ చరణ్ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడట. ఇక రీసెంట్ గానే వీరిద్దరూ ముంబై కలవగా రాజ్ కుమార్ హిరానీ రామ్ చరణ్ కు కథ కూడా వినిపించడని టాక్.

అయితే ఎంతో మంది బాలీవుడ్ స్టార్ హీరోలు రాజ్ కుమార్ హిరాణితో కలిసి పని చేయడానికి రెడీ గా ఉంటారు. అయితే ఆయన మాత్రం చరణ్ తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉండటం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఈ బజ్ ప్రకారంగా ఒకవేళా ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా గనక వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ లెక్కలు మొత్తంగా మారతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

- Advertisement -

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ కు గవరల్డ్ వైడ్ గా పాపులారిటీ వచ్చింది. దానికి తోడు రామ్ చరణ్ చేతిలో ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలో ఒకటి టాప్ డైరెక్టర్ శంకర్ సినిమా అవడం విశేషం.ఇక ఆ సినిమా కంప్లిట్ అయ్యేలోపే అంతలోనే మరో టాప్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడని న్యూస్ రావడం మంచి సంకేతం అని చెప్పొచ్చు.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు