Dunki vs Salaar: డంకి వర్సెస్ సలార్ రెండిటిలో రిస్క్ దేనికి ఎక్కువ ?

Dunki vs Salaar

ప్రస్తుతం సినీ ప్రేక్షకులదరి దృష్టి డిసెంబర్ 22 పైనే ఉన్న సంగతి తెలిసిందే. కారణం అదే రోజున రెండు భారీ సినిమాలైన సలార్, డంకి బాక్స్ ఆఫీస్ వద్ద తలపడుతుండటమే. వీటిలో డంకి సినిమా సెన్సిటివ్ అంశాలను చర్చించే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే, మరొకటి ప్యూర్ మాస్ సినిమా అయిన సలార్.

కెజియప్ సినిమాతో మాస్ సినిమాను రి-డిఫైన్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న సలార్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక డంకి సినిమా విషయానికొస్తే బాలీవుడ్ లో అపజయం అంటూ తెలియని డైరక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా రాబోతున్న సినిమా డంకి.

ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి రేపుతున్న చిత్రాలే..కానీ ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతుండటం ప్రస్తుతం చర్చినీయ అంశం అయింది. డంకి సినిమా డిసెంబర్ 22 న రిలీజ్ చేయబోతున్నట్టు చాలా రోజుల క్రితమే ప్రకటించారు మేకర్స్. కానీ సలార్ సినిమా సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22 కు పోస్ట్ పోన్ అయింది. దాంతో ఈ రెండు సినిమాల రిలీజ్ విషయంలో ఏ సినిమాకు ఎక్కువ రిస్క్ అనే అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చినీయ అంశంగా మారింది.

- Advertisement -

2018 లో డిసెంబర్ 21న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కెజియఫ్ పార్ట్ వన్ సినిమా రిలీజ్ అయింది. అదే రోజున షారుఖ్ ఖాన్ హీరోగా భారీ అంచనాల మధ్య జీరో సినిమా కూడా అదే రోజున రిలీజ్ అయింది. కాగా అప్పుడు కెజియఫ్ పార్ట్ వన్ హిందీలో డబ్బింగ్ సినిమా అయినప్పటి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక జీరో సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ఇక సరిగ్గా అయిదేళ్ల తరువాత మళ్ళీ 2023 లో షారుఖ్ ఖాన్ డంకి, ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలు తలపడబోతున్నాయి. దాంతో 2018 లో వచ్చిన రిజల్ట్ మళ్ళీ రిపీట్ అవుతుందని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో మీమ్స్ వేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఇక ఈ సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ పక్కన పెడితే ఈ విధంగా రెండు భారీ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవడం ఇదేమి కొత్తేమి కాదు ఇంతకు ముందు చాలా సార్లు జరిగాయి. అలా రిలీజైన సినిమాలలో కొన్ని సార్లు రెండు సినిమాలు హిట్టైన సందర్భాలున్నాయి. అలాగే ఫ్లాప్ అయిన సిచువేషన్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ పద్దతిలో చూస్తే రిస్క్ ఏ సినిమా కని చెప్పడం కష్టమైన విషయమే. ఈ కాలంలో సినిమా ఆడాలంటే కంటెంట్ ఉండాలి.అది గనక రెండు సినిమాలో ఉంటె రెండు సినిమాలు హిట్ అవడాన్ని ఎవరు ఆపలేరు

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు