Salaar Release Date: ప్రభాస్ ఇచ్చిన అవకాశం… అయినా బాక్సాఫీస్ బోసిపోయింది

Salaar Release Date

ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు… సగటు సినిమా అభిమాని ఎదురుచూసిన రోజు ఇది. ఎందుకంటే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ ఈ రోజే విడుదల కావాల్సింది. అన్ని బాగుంటే… ఈ రోజు సలార్ సునామి ఉండేది. ఎక్కడా చూసిన ప్రభాస్ నామస్మరణతో ఫ్యాన్స్ ఊగిపోయే వాళ్లు.. అటు గణేష్ నిమర్జనంతో పాటు ఇటు సలార్ విధ్వంసం ఉండేది. కానీ, ప్యాచ్ వర్క్… పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం అనే పేరుతో వాయిదా వేశారు.

ఒక వేళ ఈ రోజు సలార్ రిలీజ్ అయితే బాక్సాఫీస్ పరిస్థితి మరోలా ఉండేది. నేడు థియేటర్స్ లోకి వచ్చిన స్కంద, చంద్రముఖి2 కి నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే వాక్సిన్ వార్ మూవీకి కూడా అనుకున్నంత టాక్ రావడం లేదు. అంటే ఈ వారం బాక్సాఫీస్ బోసి పోయింది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు తెలుగులో అటు హిందీ స్టేట్స్‌లో ప్రేక్షకులు థియేటర్స్ వైపు అడుగులు వేయడం లేదు. ఈ వీకెండ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఇప్పుడే తెలిసిపోతుంది.

నిజానికి సలార్ ఈ రోజు థియేటర్స్ లో వస్తే… ఈ సినిమాలేవీ కూడా వచ్చేవి కాదు. సలార్ వాయిదా పడిందనే ధైర్యంతోనే ఈ సినిమాలు నేడు సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చాయి. నేడు సలార్ రిలీజ్ కాకపోవడం ఈ సినిమాలకు ఓ వరం లాంటిది. కానీ, ఈ అవకాశాన్ని ఆయా సినిమాలు సద్వినియోగం చేసుకోలేవు అని మాత్రం కచ్చింతంగా చెప్పొచ్చు.

- Advertisement -

నేటి సినిమాల ఫలితాలు చూసిన తర్వాాత ప్రభాస్ ఫ్యాన్స్… ప్రశాంత్ నీల్‌పై, ప్రొడ్యూసర్స్ హంబోలే ఫిల్మ్స్ పై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి రోజు సలార్ రిలీజ్ అయితే, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వరద పారేదని, అలాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు అంటూ మండిపడుతున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ ఆవేదన కరెక్ట్ అనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే… సలార్ ఎప్పుడు రిలీజ్ అయినా, ఆ వారం ప్రభాస్‌దే.
అప్పుడు వచ్చే రికార్డులను… అవార్డులను ఎవరూ అపలేరు. అలాగే ఆ రోజు.. ఆ వారం ఎలాంటి సినిమాలు రిలీజ్ అయినా, సలార్ ధాటిని తట్టుకోలేవు.

సో… ఈ వారం కాకపోయినా, సలార్ రిలీజ్ అయ్యే వారం అయినా ప్రభాస్ నామస్మరణ తప్పక ఉంటుంది. దాని కోసం ప్రభాస్ వెయిట్ చేయాల్సిందే. కాగా, సలార్ ఈ డిసెంబర్ 22న విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారని టాక్ వస్తున్న సంగతి తెలిసిందే.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు