Prabhas’s Salaar: ఇట్స్ అఫీషియల్ – సలార్ టీమ్ ఇప్పుడు మేలుకుంది..!

Prabhas’s Salaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సలార్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. చాలా కాలం కిందట షూటింగ్ మొదలైన ఈ సినిమాకి సంబంచిన గ్లిమ్ప్స్ మినహా ఏ అప్డేట్ లేకపోవటంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కానుందని మొదట్లో అనౌన్స్ చేసినప్పటికీ వీఎఫెక్స్ విషయంలో జాప్యం వల్ల పోస్ట్ పోన్ అయ్యిందని గత కొంత కాలంగా వార్తలొచ్చాయి.

రిలీజ్ వాయిదా పడిందని వార్తలొస్తున్నా కానీ, సినిమా యూనిట్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవటంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. సలార్ రిలీజ్ వాయిదా వాయిదా పడటంతో ఆ డేట్ కి చిన్న సినిమాలన్నీ ఫిక్స్ అయ్యాయి. ఇంత కరుగుతున్నా కానీ సినిమా యూనిట్ సైలెంట్ గా ఉండటం పట్ల ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. రిలీజ్ డేట్ పై సలార్ యూనిట్ తాజాగా స్పందించింది. కొన్ని అనివార్య కారణాల  వల్ల సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యిందని, త్వరలోనే కొత్త డేట్ అనౌన్స్ చేస్తామని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపింది.

- Advertisement -

ఇదిలా ఉండగా సలార్ సినిమా నవంబర్ కానీ, డిసెంబర్లో కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే, నవంబర్లో సల్మాన్ ఖాన్ టైగర్ సినిమా, డిసెంబర్లో యానిమల్ సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో సలార్ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం ఉంటుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.+

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు