Prabhas’s Salaar: స్పీడ్ పెంచిన ప్రభాస్ – డిజాస్టర్స్ దెబ్బకు మారిపోయాడా..?

Prabhas’s Salaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సలార్ సినిమా పూర్తి చేసిన ప్రభాస్ కల్కి సినిమా మీద దృష్టి పెట్టాడు. పెద్దగా అప్డేట్స్ లేని మారుతి సినిమా షూటింగ్ కూడా చాలావరకు పూర్తయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలతో పాటుగా సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ సినిమా కూడా కమిట్ అయ్యాడు ప్రభాస్.

ప్రస్తుతం యానిమల్ షూటింగ్ లో బిజీగా సందీప్, ఈ సినిమా పూర్తవ్వగానే స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ డైరెక్టర్ సందీప్ కి ఒక కండిషన్ పెట్టాడని సమాచారం అందుతోంది. స్పిరిట్ సినిమా షూటింగ్ ని ఎట్టి పరిస్థితిలో వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడట ప్రభాస్.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఎంత టైమ్ తీసుకున్నా పర్లేదని షూటింగ్ మాత్రం ఆరు నెలల్లో కంప్లీట్ చేయాలని డైరెక్టర్ సందీప్ కి కండిషన్ పెట్టాడట ప్రభాస్. ఇప్పటి దాకా ప్రొడక్షన్ వర్క్ మీద పెద్దగా దృష్టి పెట్టని ప్రభాస్ ఇప్పుడు షూటింగ్ త్వరగా కంప్లీట్ చేయాలని డిసైడ్ అవ్వటం వెనక కారణం వరుస డిజాస్టర్స్ వచ్చిన ఎఫెక్ట్ అని అంటున్నారు.

- Advertisement -

షూటింగ్ డిలే అవ్వటం వల్ల బడ్జెట్ పెరగటమే కాకుండా సినిమా మీద హైప్ కూడా తగ్గుతుంది కాబట్టి అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయగలిగితేనే ప్రేక్షకుల అంచనాలు అందుకునే అవకాశం ఉంది. ప్రభాస్ గత చిత్రం ఆదిపురుష్ డిజాస్టర్ అవ్వటానికి రిలీజ్ వాయిదా పడటం కూడా ఒక కారణమే అని చెప్పాలి. మరి, డిజాస్టర్స్ ఎఫెక్ట్ మైండ్ సెట్ మార్చుకున్న ప్రభాస్ కి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుతుందా లేదా చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు