Rakul Preet Singh: అనుకున్నదే అయింది – అక్కడ తంతే – ఇక్కడ పడింది..!

Rakul Preet Singh

రకుల్ ప్రీత్ సింగ్, మొన్నటి దాకా స్లిమ్ అండ్ స్లీక్ ఫిజిక్ తో టాలీవుడ్ ఆడియెన్స్ ఫిదా చేసిన హీరోయిన్. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న టైమ్ లోనే బాలీవుడ్ కి మకాం మార్చేసింది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. హిందీలో చేసిన సినిమాలు ఆశించిన రేంజ్ లో హిట్ అవ్వకపోవటంతో అక్కడ చెప్పుకోదగ్గ ఆఫర్లు రాలేదు. అదే టైమ్ లో తెలుగులో వరుస డిజాస్టర్స్ పడటంతో రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యింది రకుల్ పరిస్థితి.

ప్రస్తుతం రకుల్ నటిస్తున్న ఇండియన్2 సినిమా పైనే ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో యాక్ట్ చేస్తున్న రకుల్, ఈ సినిమా హిట్ అయితే, సౌత్ లో ఆఫర్స్ వస్తాయని ఈదురు చూస్తోంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పింది. త్వరలోనే ఇండియన్2, ఆలవాన్, సహా హిందీతో పాటు ఐదు, ఆరు లాంగ్వేజెస్ లో తన సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయని చెప్పింది.

ఈ మధ్య తెలుగు సినిమాల్లో కనిపించకపోయినా ఫ్యాన్స్ మాత్రం ఎప్పటిలాగే తనని ఆదరిస్తున్నారని, మంచి ఆఫర్స్ వస్తే తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తానని చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్. మరి, బాలీవుడ్ ఆశలతో చేతులు కాల్చుకున్న రకుల్ కి ఇండియన్ సినిమా సౌత్ లో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు