Rules ranjann trailer talk : “రొటీన్ రంజన్” కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో ఫ్లాప్ లోడింగ్..

Rules ranjann trailer talk

కిరణ్ అబ్బవరం హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమా రూల్స్ రంజన్ థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితం రిలీజయింది. టిల్లు బ్యూటీ నేహా శెట్టి, కిరణ్ అబ్బవరం ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ రూల్స్ రంజన్ సెప్టెంబర్ 28 థియేటర్స్ లో విడుదలబోతుంది. దాంతో ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు మూవీ యూనిట్.

గతంలో రిలీజైన సన్మోహనుడా సాంగ్ తో పాపులరైన ఈ రూల్స్ రంజన్ సినిమా ట్రైలర్ ను కాసేపటి క్రితం రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇక ట్రైలర్ ఎలా ఉందొ ఒక్క ముక్కలో చెప్పాలంటే సోషల్ మీడియాలో తరుచుగా వాడే రొట్ట రొటీన్ అనే పదం తో పోల్చి చెప్పవచ్చు. అప్పుడెప్పుడో ఉదయ్ కిరణ్, తరుణ్ లు హీరోగా లుగా ఉన్న టైం లో దర్శకుడు రాసుకున్న కథను ఇప్పుడు సినిమాగా తీసినట్టుంది రూల్స్ రంజన్ ట్రైలర్. ప్రొడక్షన్ పరంగా కూడా సినిమాలో అంతగా క్వాలిటీ లేదని విజువల్స్ బట్టి తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఆకట్టుకునే మ్యూజిక్ గాని విజువల్ గ్రాండియర్ గని ఏది లేదని ట్రైలర్ తోనే తేలిపోయింది.సరే ఇవన్నీ లేవు కనీసం సినిమా కథైనా కొత్తగా ఉందా అని అంటే అది కూడా లేదు. ఇక ఈ సినిమా ట్రైలర్ ను బట్టి చూస్తే కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో ఫ్లాప్ పడినట్టే అని తెలుస్తోంది.

ఇక ఈ టెక్నీకల్ టీం విషయానికొస్తే గతంలో గోపిచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజన్ అనే సినిమా తీసిన రథినం కృష్ణ ఈ రూల్స్ రంజన్ సినిమాను డైరెక్ట్ చేసారు. వెన్నెల కిషోర్, హైపర్ ఆది, నెల్లూరు సుదర్శన్ కీలక పాత్రలలో నటించారు. కేవలం ట్రైలర్ తోనే కావాల్సినంత నెగిటివిటీ మూటగట్టుకున్న ఈ సినిమా థియేటర్స్ ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు