Sam And VD’s Kushi: విజయ్, సామ్ లకు శాపం – హోమం పూర్తి చేయాల్సింది..!

Sam And VD’s Kushi

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంత కలిసి నటించిన ఖుషి సినిమా రీసెంట్ గా రిలీజయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వీకెండ్ కి కలెక్షన్స్ బాగానే ఉన్నా కానీ, సెకండ్ వీక్ లో హ్యుజ్ డ్రాప్ కనిపిస్తోంది. ఫస్ట్ త్రి డేస్ కి 70 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా మండే నుండి స్పీడ్ తగ్గించింది. సెప్టెంబర్ 7th నాటికి మరీ దారుణంగా ఇండియా మొత్తానికి 50lakhs మాత్రమే కలెక్ట్ చేసింది.

లైగర్ శాకుంతలం లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్స్ తర్వాత ఖుషి సినిమాతో హిట్ వచ్చిందని సంతోష పడే లోపే కలెక్షన్స్ ఈ రేంజ్ లో డ్రాప్ అవ్వటం సమంత, విజయ్ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తుంది. సినిమా ఫ్యాన్స్ ఆశించిన రేంజ్ లో లేకపోవటం ఒక రీజన్ అయితే, ఈ వీక్ లో రిలీజ్ అయిన మిస్ శెట్టి,మిస్టర్ పోలిశెట్టి సినిమాలకు పాజిటివ్ టాక్ రావటం ఇంకో రీజన్ అని చెప్పచ్చు. మొత్తానికి డిజాస్టర్ తర్వాత డీసెంట్ హిట్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా నిరాశే మిగిలింది విజయ్, సమంత జోడీకి.

ఇదిలా ఉండగా, ఖుషి సినిమా 100కోట్ల క్లబ్ రిచ్ అవ్వకపోవటంతో నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో విజయ్, సమంతలు హోమం పూర్తి చేయకపోవటం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరశురామ్ డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తుండగా సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి హాలిడేకి అమెరికా వెళ్లి రిలాక్స్ అవుతుంది. మరి, డిజాస్టర్ ట్రాక్ నుండి బయట పడ్డ సమంత, విజయ్ లకు నెక్స్ట్ సినిమాలైనా 100కోట్ల మైల్ స్టోన్ రీచ్ అయ్యేలా చేస్తాయో లేదో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు