Sam And VD’s Kushi: విజయ్, సమంత మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడానికి కారణం ఇదే..!

Sam And VD’s Kushi

విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ఖుషి సినిమా రిలీజయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సమంత మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. విజయ్, సమంతలను చూస్తున్నంత సేపు రీల్ కపుల్ ని కాకుండా రియల్ కపుల్ ని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది.

ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య డెవలప్ అయిన ఫ్రెండ్షిప్ వల్ల స్క్రీన్ మీద కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వటానికి మెయిన్ రీజన్ గా చెప్పవచ్చు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ మేమిద్దరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుండి ఏ బాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చామని, ఈ కారణంగానే తమ ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యిందని చెప్పాడు.

సమంత కూడా విజయ్ గురించి పలు సందర్భాల్లో పాజిటివ్ గా మాట్లాడటం, ఇన్స్టాగ్రామ్ లో ప్రెయిజ్ చేస్తూ పోస్ట్స్ కూడా పెట్టింది. ప్రస్తుతం సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వటం చూస్తుంటే విజయ్ సమంత మధ్య చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉన్న మాట నిజమే అన్న కామెంట్స్ వస్తున్నాయి. ట్రైలర్ రిలీజైన రోజు నుండే విజయ్ సమంతల మధ్య కెమిస్ట్రీ పై ఆసక్తి నెలకొన్న సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

- Advertisement -

ఖుషి సినిమా మ్యూజికల్ కాన్సర్ట్ తర్వాత హాలిడే కోసం ఫారిన్ వెళ్లిన సమంత అక్కడ చిల్ అవుతూ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోస్ అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. ఈ క్రమంలో ఖుషి సినిమా రిలీజ్ కి ముందు విజయ్ సమంతకి మిడ్ నైట్ టైమ్ లో వీడియో కాల్ చేసి సప్రైజ్ ఇవ్వటం, తర్వాత విజయ్ అమ్మాయి చేతిలో చేయి వేసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఆ చెయ్యి సమంతదే అని, లేదు రష్మికది అని ప్రెడిక్షన్స్  స్టార్ట్ చేశారు నెటిజన్లు. త్వరలోనే అనౌన్స్ చేస్తున్నా అంటూ విజయ్ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇవ్వటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు