Kushi: తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ని దోచుకుంటున్నారా..?

Kushi

సినిమా సక్సెస్ అవ్వటంలో మ్యూజిక్ కీరోల్ ప్లే చేస్తుందన్నది కాదనలేని నిజం. డైలాగ్స్ లో కన్వే చేయలేని ఫీల్ ని సాంగ్స్, బీజీఎమ్స్ తో కన్వే చేయచ్చు. సినిమా యావరేజ్ గా ఉన్నప్పటికీ మ్యూజిక్ వల్ల బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు, సినిమాలో కంటెంట్ ఉన్నప్పటికీ సరైన మ్యూజిక్ లేక ఫ్లాప్ హిట్ అవ్వలేకపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

డైరెక్టర్స్ బ్రెయిన్ తో సినిమాని ముందుండి నడిపితే, మ్యూజిక్ డైరెక్టర్స్ హార్ట్ తో వెనకుండి నడుపుతారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే, ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కి భారంగా మారుతున్న పరిస్థితి నెలకొంది కాబట్టి. ఈ మధ్య వస్తున్న స్టార్ హీరోల సినిమాలు గమనిస్తే, అయితే తమన్, లేదంటే దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఉంటున్నారు.

తమన్, డీఎస్పీలు తమ మ్యూజిక్ తో చాలా సినిమాలను బ్లాక్ బస్టర్స్ చేశారు. అప్పట్లో కోటి రూపాయలు, అంతకంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకొని బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన ఈ ఇద్దరూ, ఇప్పుడు సుమారు 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

- Advertisement -

తమకి ఉన్న డిమాండ్ ని బట్టి రెమ్యునరేషన్ పెంచేసిన వీరు వరుసగా స్టార్ హీరోల సినిమాలు ఒప్పుకుంటున్నారు కానీ, అనుకున్న టైమ్ కి సినిమాలు పూర్తి చేయకపోగా అప్పట్లో ఇచ్చిన బ్లాక్ బస్టర్ రేంజ్ ఆల్బమ్స్ ఇవ్వటంలో కూడా ఫెయిల్ అవుతున్నారు. అటు భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటూ, ఇటు సరైన ఆల్బమ్స్ ఇవ్వలేక నిర్మాతలను దోచుకుంటున్నారని చెప్పాలి.

మ్యూజిక్ డైరెక్టర్ వల్ల సినిమా డిలే అవుతుందని చెప్పటానికి గుంటూరు కారం సినిమా బెస్ట్ ఎగ్జామ్పుల్ అని చెప్పవచ్చు. టాలీవుడ్ లో తమన్, దేవిల లాగానే కోలీవుడ్లో అనిరుధ్ స్టార్ హీరోల సినిమాలకు ఫస్ట్ ప్రయారిటీగా మారిన నేపథ్యంలో నిర్మాతలకు భారంగా మారుతున్నాడు.

ఈ నేపథ్యంలో తమకు జరుగుతున్న నష్టాన్ని గ్రహించిన కొంతమంది నిర్మాతలు ఆల్టర్నేటివ్స్ మీద దృష్టి పెడుతున్నారు. ఖుషి సినిమానే ఇందుకు నిదర్శనం. ఖుషి సినిమాకి కేవలం కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న అబ్దుల్ వహాబ్ మంచి క్వాలిటీతో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు.

ఖుషి సినిమా రిలీజ్ కి ముందే మ్యూజిక్ తో సగం హిట్ అయ్యిందంటే అందుకు మ్యూజిక్ డైరెక్టరే కారణం అని చెప్పాలి. మ్యూజిక్ ఆల్బమ్ రూపంలో ఖుషి ప్రొడ్యూసర్స్ కి 10నుండి 12కోట్ల వరకు లాభం వచ్చిందని టాక్ వినిపిస్తోంది. అదే ఈ సినిమాకు దేవి, తమన్ లు మ్యూజిక్ ఇచ్చి ఉంటే, ఇంత ఫ్రెష్ మ్యూజిక్ వచ్చేది కాదు, ప్రొడ్యూసర్స్ కి ఇంత ప్రాఫిట్ కూడా వచ్చేది కాదు. ఈ నేపథ్యంలో తమన్ దేవిశ్రీ ప్రసాద్ లు యాటిట్యూడ్ మార్చుకోకపోతే, త్వరలోనే చేతిలో సినిమాలు లేకుండాపోయే ప్రమాదం ఉంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు