Samantha’s Kushi: అతడి చేతిలో మోసపోయిన సమంత..!

Samantha’s Kushi

సమంత విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కండక్ట్ చేసిన మ్యూజికల్ కాన్సర్ట్ లో పాల్గొన్న సమంత ప్రస్తుతం ఫారిన్ లో హాలిడే కి వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత కొంత కాలం పాటు ఫారిన్ లోనే ఉండబోతుంది.
గత చిత్రం శాకుంతలం ద్వారా డిజాస్టర్ అందుకున్న సమంతకి ఖుషి సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. ఇటీవలే రిలీజైన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా సమంత గురించి ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
సమంత పర్సనల్ మేనేజర్ చేతిలో మోసపోయిందని న్యూస్ సారాంశం. సమంతకి తెలియకుండా కోటిరూపాయలు వరకు కొట్టేయాలని ప్లాన్ వేశాడట సదరు మేనేజర్. తనను సొంత కుటుంబ సభ్యుడిలా భావించిన సమంత, ఈ విషయం తెలిసి చాలా బాధపడిందట. ఆ తర్వాత అతని స్థానంలో ఇంకో అతన్ని మేనేజర్ గా నియమించుకుందని సమాచారం.
ట్రైలర్లో విజయ్ సమంత మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచిన నేపథ్యంలో ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ సినిమా మణిరత్నం సఖి సినిమాకి ఫ్రీమేక్   లాగా ఉందని కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ శివ నిర్వాణ ట్రైలర్ లో చూపించని మెయిన్ పాయింట్స్ సినిమాలో చాలా ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు. మరి, సమంత, విజయ్ తో పాటు శివ నిర్వాణకి కూడా హిట్ తప్పనిసరైన పరిస్థితిలో వస్తున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు