Vijay and Samantha’s Kushi: ఖుషి సినిమా అయినా బయ్యర్లను బతికిస్తుందా..?

Vijay and Samantha’s Kushi

ఈ ఏడాది ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ రేట్ చాలా తక్కువ నమోదయ్యిందనే చెప్పాలి. ఎన్నో హోప్స్ తో రిలీజైన పెద్ద సినిమాలన్నీ బోల్తా కొట్టగా, బలగం, బేబీ, సామజవరగమన వంటి చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ప్రొడ్యూసర్స్ సంగతి పక్కన పెడితే, వరుసగా సినిమాలు డిజాస్టర్స్ అవ్వటం బయ్యర్లు, ఎక్జిబిటర్లకు కోలుకోలేని నష్టాన్ని మిగుల్చుతుంది.

రావణాసుర సినిమాతో మొదలై ఏజెంట్, బ్రో, భోళాశంకర్ వంటి పెద్ద సినిమాలన్నీ నిరాశపరచడంతో థియేటర్లు వెలవెలబోయాయి. ఈ నేపథ్యంలో ఎక్జిబిటర్ల ఆశలన్నీ ఖుషి సినిమా మీదనే ఉన్నాయి. శివ నిర్వాణ డైరెక్షన్లో సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్లో విజయ్ సమంత మధ్య కెమిస్ట్రీ హైలైట్ అవ్వటంతో సినిమాకు కూడా అదే ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. లైగర్, శాకుంతలం లాంటి డిజాస్టర్స్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా హిట్ అవ్వటం సమంత విజయ్ లకు కీలకంగా మారింది.

- Advertisement -

అనుకున్నట్టు ఖుషి సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని హిట్ అయితే ఒక కానీ, ఏ మాత్రం తేడా కొట్టినా కూడా థియేటర్ యజమానులకు గడ్డు కాలం దాపురించే అవకాశం ఉంది. అసలే ఓటీటీల రాకతో థియేటర్లలో సినిమా లైఫ్ టైమ్ క్రమంగా తగ్గిపోతూ సింగిల్ స్క్రీన్ల ఉనికి ప్రశార్థకం అవుతున్న నేపథ్యంలో ఖుషి సినిమా హిట్ అయ్యి బయ్యర్లకు కాస్తయినా హోప్స్ ఇస్తుందేమో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు