Vijay And Samantha’s Kushi: ఇడ్లీ స్టాల్ కథ ఏంటి సామ్…!

Vijay And Samantha’s Kushi

లేడి సూపర్ స్టార్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ జంట శివ నిర్వాణ డైరెక్షన్లో రూపొందిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. విడుదల దగ్గరపడుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ ని ముమ్మరం చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగా, ప్రమోషన్స్ లో భాగంగా మ్యూజికల్ కాన్సర్ట్ పేరిట కండక్ట్ చేసిన ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వటంతో సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

ఈ ఈవెంట్ లో సమంత, విజయ్‌ల లైవ్ పర్ఫామెన్స్ హైలైట్ గా నిలువగా సమంత స్పీచ్ గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. “మీ కోసమే కష్టపడుతున్నాను, కొంత గ్యాప్ తర్వాత మళ్లీ వస్తాను, తప్పకుండా బ్లాక్ బస్టర్ ఇస్తాను” అని చెప్పి ఫ్యాన్స్ లో జోష్ నింపిన సమంత స్పీచ్ లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది.

ఈ సినిమా షూటింగ్ కి లేట్ చేయకుండా సమయానికి వచ్చానని, దేవుడి దయ వల్ల శివ, విజయ్ లు విజయవాడలో ఇడ్లీ స్టాల్ పెట్టుకునే అవకాశం రాలేదని, ఇడ్లీ స్టాల్ ఎలా నడుపుతారో తెలీదు కానీ విజయ్, శివ లు మంచి సినిమాను మీ ముందుకు తీసుకువస్తారని నమ్మకం ఉందని కామెంట్ చేసింది.

- Advertisement -

సమంత చేసిన ఇడ్లీ స్టాల్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఈ ఇడ్లీ స్టాల్ కథ ఏంటి?, గతంలో సమంతపై ఎవరైనా చేసిన కామెంట్స్ కి ఇప్పుడు కౌంటర్ ఇచ్చిందా అన్న కోణంలో నెటిజన్స్ రీసర్చ్ మొదలు పెట్టారు. అయితే, ఇడ్లీ బండికి సినిమా కథతో ఏదైనా లింక్ ఉండచ్చని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి సినిమా మీద ఆసక్తి పెంచుతున్న ఈ ఇడ్లీ స్టాల్ వెనుక కథ ఏంటో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకూ వేచి చూడక తప్పదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు