Vijay And Samantha’s Kushi: విజయ్, సమంత జోడి ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా..?

Vijay And Samantha’s Kushi

రౌడీ హీరో విజయ్ దేవరకొండ,లేడి సూపర్ స్టార్ సమంత కలిసి నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆకట్టుకోగా, సాంగ్స్ కి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో  సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ జంటకు శాకుంతలం, లైగర్ సినిమాల రూపంలో చెరొక డిజాస్టర్ ఉన్న నేపథ్యంలో ఖుషి సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారిందని చెప్పాలి. శివ నిర్వాణ డైరెక్షన్లో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదేంటంటే, ఖుషి సినిమా ట్రైలర్ కి మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన క్లాసిక్ మూవీ సఖి లోని సీన్స్ కి పోలికలు ఉన్నాయని రెండిటిని కంపేర్ చేస్తూ ఎడిట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

నిజానికి ఖుషి సినిమా నుండి మొదట రిలీజైన నా రోజా నువ్వే సాంగ్ లో లిరిక్స్ తోనే ఈ సినిమాకు మణిరత్నం సినిమాలకు లింక్ ఉందన్న విషయం స్పష్టం అయ్యింది. ఇప్పుడు ట్రైలర్లో కూడా సఖి సినిమాకి పోలికలు ఉన్న నేపథ్యంలో ఖుషి సినిమా సఖికి రీమేక్ ఆ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. సఖి సినిమాలో అప్పట్లో బ్లాక్ బస్టర్ అవ్వటమే కాకుండా లవ్ స్టోరీస్ లో ఒక కొత్త ట్రెండ్ కి నాంది పలికింది.

సఖిలో మాధవన్, శాలినిల జోడి యూత్ పై బలమైన ముద్ర వేసింది. ఇప్ప్డుడు ఖుషి సినిమా ద్వారా సమంత విజయ్ జంట ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. ట్రైలర్ లో విజయ్ సమంతల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకోవడంతో ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి, టాక్ జగదీష్ సినిమాతో నిరాశ పరిచిన శివ నిర్వాణ ఖుషితో కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు