Kushi: సమంతను మళ్లీ టార్గెట్ చేస్తున్న నెటిజన్స్..!

నాగచైతన్యతో డైవర్స్ అయిన నాటి నుండి సమంత తరచూ ఏదో ఒక అంశం మీద టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే, సమంత విమర్శలకు ఏ మాత్రం జంకకుండా ఎప్పటికప్పుడు గట్టి సమాధానం ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ ముందుకెళ్తోంది. ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తోంది. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ సింగిల్ బ్లాక్ బస్టర్ అవ్వటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ కూడా అలరిస్తోంది. ఈ సాంగ్ విజయ్, సమంతల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

ఇదిలా ఉండగా ఈ లిరికల్ సాంగ్ లోని ఓ స్టిల్ వల్ల సమంత ట్రోలర్స్ కి టార్గెట్ అయ్యింది. విజయ్ సమంతపై కాలు పెట్టిన ఆ స్టిల్ కారణంగా సమంతని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. గతంలో మహేష్ ‘వన్ నేనొక్కడినే’ సినిమాలోని ఒక సాంగ్ లో హీరో వెనక హీరోయిన్ మోకాళ్లపై పాకుతూ ఉన్న షాట్ ని టార్గెట్ చేస్తూ సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు సమంత మీద ట్రోల్స్ రావటానికి కారణం అయ్యింది. అప్పుడు హీరో వెనకాల హీరోయిన్ మోకాళ్లపై పాకితే వచ్చిన అభ్యంతరం ఇప్పుడు విజయ్ ఏకంగా నీ మీద కాలు బేసినప్పుడు రాలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఆ రకంగా అప్పట్లో జెండర్ డిస్క్రిమినేషన్ అంటూ సమంత చేసిన పోస్ట్ ఇప్పుడు ఆమెను ట్రోల్ చేయటానికి కారణం అయ్యింది. శాకుంతలం, లైగర్ వంటి డిజాస్టర్స్ తర్వాత విజయ్ సమంత కలిసి నటించిన ఖుషి సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఇప్పటికే మంచి బజ్ ఏర్పడ్డ క్రమంలో రిలీజ్ అయ్యాక అంచనాలను అందుకుంటుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు