Hi Nanna: అంటే మృణాల్ ఠాకూర్ తల్లి కాదా?

టాలీవుడ్ అప్ కమింగ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా వస్తున్న సినిమా “హాయ్ నాన్న”. నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్  నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాను శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. నానికి హీరోగా ఈ సినిమా 30వ సినిమా కాగా, రీసెంట్ గానే ఈ సినిమాకి టైటిల్ నిర్ణయించడంతో పాటు, ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.

అయితే రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ వీడియో లో దాదాపు కాన్సెప్ట్ చెప్పేసినట్టు అనిపిస్తుంది. మొన్నటివరకు ఈ సినిమా తండ్రి కూతుళ్ళ మధ్య జరిగే ఎమోషనల్ మూవీ గా రూపొందుతుందని, ఒక మంచి ఫీల్ గుడ్ డ్రామా చూడబోతున్నామని అనుకున్నారు. ఇక ఈ సినిమాలో నాని చిన్న పాపకి తండ్రిగా నటిస్తున్నాడని తెలిసిందే. నాని పాపకి నాన్న అయినపుడు, హీరోయిన్ మృణాల్ అమ్మే అవుతుందని అనుకున్నారు. కానీ గ్లిమ్ప్స్ లో నాని కూతురే మృణాల్ ని పరిచయం చేస్తున్నట్టు చూపించారు.

దీన్ని బట్టి ఈ సినిమాలో పాపకి మృణాల్ తల్లి కాదని తెలుస్తుంది. బహుశా ఈ సినిమాలో నాని భార్య చనిపోయి ఉండవచ్చు, లేదా నాని ఆ పాప దత్తత తీసుకుని ఉండవచ్చు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ కాన్సెప్ట్ ఇదివరకు చాలా సినిమాల్లో చూసే ఉంటాం. అయితే దీన్ని డైరెక్టర్ తన స్క్రీన్ ప్లే బలం తో ఏ విధంగా చూపిస్తాడో చూడాలి. ఎలాంటి ఆడియన్స్ అయినా కథ ఎంత బాగుండాలని కోరుకుంటాడో, దాని స్క్రీన్ ప్లే కూడా అదే విధంగా ఉండాలని అనుకుంటారు.

- Advertisement -

ఇక “హాయ్ నాన్న” సినిమాను డిసెంబర్ 21 విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తుండగా, ఈ సినిమా తో పాటు మృణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండ తోను ఒక సినిమా చేస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు