SatyaPrem Ki Katha: కియారా సినిమా అప్పుడే వందకొట్టేసింది..

కియారా అద్వానీ వరుస హిట్లతో దూసుకుపోతుంది. గత ఏడాది షేర్షా, భూల్ భూలియా వంటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన కియారా ఈ ఏడాది కూడా బ్లాక్ బస్టర్ తో ప్రారంభించింది. హిందీలో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం “సత్యప్రేమ్ కి కథ”. ఈ సినిమాను సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించగా, “ఎన్ జి ఎంటర్టైన్మెంట్స్” బ్యానర్ లో సాజిద్ నదియాద్వాల నిర్మించాడు.

లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై, ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ సినిమా 100కోట్ల క్లబ్ లోను చేరిపోయి అందర్నీ ఆశ్చ్యర్య పరిచింది. జూన్29 న విడుదలైన ఈ సినిమా కేవలం 12 రోజుల్లోనే ఈ ఫీట్ ని సాధించడం విశేషం. ఇక కార్తిక్ ఆర్యన్, కియారా అద్వానీ మధ్య కెమిస్ట్రీ, ఇంకా సినిమాలో ఎమోషన్స్ , కామెడీ సత్య ప్రేమ్ కి కథ సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి దోహద పడ్డాయి.

బాలీవుడ్ లో ఈ వారం పెద్దగా సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమాకి అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఇప్పటికి మల్టీప్లెక్స్ లలో హౌస్ ఫుల్ అవుతున్న ఈ సినిమా 150 కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమా హిట్ తో బాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ ట్యాగ్ ని సొంతం చేసుకుంది ఈ భామ. ఇక కియారా అద్వానీ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా, ఈ సక్సెస్ ను రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తోను కంటిన్యూ చేయాలనీ భావిస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు