Kushi musical concert : విజయ్ కు అలాంటి పరిస్థితి రానివ్వను – సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Kushi musical concert

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న ఖుషి సినిమా మ్యూజికల్ కాన్సర్ట్ నిన్న సాయంత్రం ఘనంగా జరిగింది. సెప్టెంబర్ 1 న గ్రాండ్ థియేటర్స్ లో రిలీజవబోతున్న ఈ సినిమాపై నానాటికి అంచనాలు పెరుగుతున్నాయి. గతకొద్ది రోజులుగా ఖుషి సినిమా నుంచి వస్తోన్న ప్రతి పాట చార్ట్ బస్టర్ అవుతుండగా సినిమా రిజల్ట్ విషయంలో మేకర్స్ అంత నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక నిన్న సాయంత్రం జరిగిన మ్యూజికల్ కాన్సర్ట్ లో విజయ్ దేవరకొండ- సమంత పెర్ఫామెన్స్ హైలెట్ గా నిలవగా, సమంత స్పీచ్ ప్రేక్షకుల అందరిని కదిలించిందని చెప్పాలి. సమంత తన ఆరోగ్యంపై చేసిన వ్యాఖ్యలు ఈవెంట్ లో అందరిని ఎమోషనల్ అయ్యేలా చేసాయి. ఖుషి సినిమా పాటలు తాను షూటింగ్ సమయంలో వింటున్నప్పుడే ఆమెకు బాగా నచ్చాయని, ఆడియన్స్ కు కూడా ఈ పాటలు నచ్చి, ఈ అల్బమ్ ను ఇంత పెద్ద హిట్ చేసినందుకు సంతోషంగా ఉందని సమంత చెప్పుకొచ్చింది

ఖుషి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ సమంత పేరు మీద విజయవాడ లో ఇడ్లి బండి పెడుతాం అంటూ సరదా వ్యాఖ్యలు చేయగా, సమంత ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. విజయ్ కు అలాంటి పరిస్థితి రానివ్వకుండా ముందే సినిమాను ఫినిష్ చేశాను అంటూ చెప్పుకొచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ ఖుషి సినిమా విషయంలో సమంతకు అండగా ఉన్నందుకు గాను వాళ్ళు చేసిన సపోర్ట్ ను ఆమె గుర్తు చేసుకొని, వాళ్లకు థాంక్స్ చెప్పింది. అలాగే ఆడియన్స్ కు ఒక మంచి సినిమా అందించాలనే తమ ప్రయత్నమంతా అని ఆమె మాట్లాడింది. తొందర్లోనే తాను పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ వచ్చి బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తామని సమంత స్పీచ్ ముగించింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు