Ritika Singh: మరో సినిమాలో ఐటెం సాంగ్ చేయనున్న బాక్సింగ్ బ్యూటీ?

Ritika Singh:

టాలీవుడ్ లో బడా సినిమాల్లో ఐటెం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ మామూలైపోయింది. కొన్నేళ్ల కిందట ఐటెం సాంగ్స్ కి స్పెషల్ డిమాండ్ ఉండేది. వాటికీ సెపెరేట్ గా ఐటెం భామలు ఉండేవారు. కానీ రాను రాను హీరోయిన్లే ఐటెం సాంగ్లు, స్పెషల్ సాంగ్లు చేసేస్తున్నారు. వాటి వల్ల సినిమాలకు కూడా మంచి హైప్ వస్తుంది. సరిలేరు నీకెవ్వరూ, పుష్ప లాంటి సినిమాల్లో స్టార్ హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్ చేయడం చూసే ఉంటాం.

ఇక తాజాగా దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కింగ్ ఆఫ్ కోత లో ఈ మధ్యనే హల్ల మచ్చారే పేరుతో ఒక స్పెషల్ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాటలో గురు ఫేమ్ రితికా సింగ్ ఐటెం గాళ్ గా కనిపించింది. ఈ సాంగ్ లో వన్ అఫ్ ది హైలెట్ గా నిలిచింది రితికా గ్లామర్. అయితే ఈ బ్యూటీ కి మరో తెలుగు సినిమాలో ఐటెం సాంగ్ చేసే ఆఫర్ వచ్చిందని నెట్టింట వార్త వైరల్ అవుతుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వస్తున్న డబల్ ఇస్మార్ట్ లో ఈ భామతో స్పెషల్ సాంగ్ చేయించాలని పూరి చూస్తున్నట్టు గాసిప్స్ వినబడుతున్నాయి.

ఇక పూరి సినిమాల్లో ఐటెం సాంగ్స్ అంటేనే ఒక బ్రాండ్ అని తెలిసిందే. పోకిరి, బిజినెస్ మ్యాన్, దేశముదురు లాంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఏ రేంజ్ లో సూపర్ హిట్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు పూరి సినిమాలో రితికా ఆఫర్ గనుక నిజమే అయితే ఆ సాంగ్ తో రితికా స్టార్ అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే ఈ రూమర్లపై చిత్ర యూనిటే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు