Rashmika Mandanna: ఆ స్టార్ హీరో కోసం హీరోయిన్ రష్మిక ఇంత దిగజారిందా ?

Rashmika Mandanna:

కన్నడ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనటువంటి ఈమె ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతుంది. ఇలా నటిగా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

సినిమాలు మాత్రమే కాకుండా పలు ప్రమోషన్లకు కూడా ఈమె భారీగానే డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నటువంటి రష్మిక ఏడాదికి సుమారు 8 కోట్లకు పైగా డబ్బులు సంపాదిస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబోలో మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం కాగా ఇప్పుడు స్పీడ్ అందుకుంది.

పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన నటిస్తోంది. అయితే ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా రాణిస్తున్న రష్మిక ఈ మూవీ కోసం తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె మూడు కోట్లు తీసుకుంటుంది. కానీ శేఖర్ కమ్ముల సినిమా కావడం, పైగా పాన్ ఇండియా మూవీ కావడంతో రెండు కోట్లకు ఓకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు