Rashmika mandanna: ఈ హీరోయిన్ కెరీర్ ఆ ఒక్క సినిమాపైనే ఆధారపడిందా?

Rashmika’s hopes are on Pushpa2

టాలీవుడ్ లో రష్మిక మందన్నా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గీతా గోవిందం తో స్టార్ హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ పుష్ప తో ఏకంగా నేషనల్ క్రష్ అయిపొయింది. అయితే గత మూడేళ్ళ్లుగా పుష్ప మినహా ఈ అమ్మడు చేసిన సినిమాలేవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మెప్పించలేకపోయాయి. సీతారామం హిట్ అయినా అందులో క్రెడిట్ మొత్తం మృణాల్ ఠాకూర్ కే వెళ్ళిపోతుంది. ఇక వారిసు సినిమాలో అయితే కేవలం పాటలకే పరిమితమయ్యింది.

దాంతో ఈ నేషనల్ క్రష్ ఫాలోయింగ్ ఏమైనా తగ్గిందా అన్న అనుమానం వచ్చే పరిస్థితి నెలకొని ఉంది. దానికి తోడు ఇప్పుడు రష్మిక చేస్తున్న సినిమాలు కూడా తక్కువే. ఈ బ్యూటీ చేతిలో మూడు సినిమాలే ఉండగా , అందులో తెలుగు సినిమా ఒక్కటే ఉంది. అదే “పుష్ప ది రూల్”. నితిన్ సినిమాలో చేస్తున్నప్పటికీ ఈ సినిమా నుండి రష్మిక ని తప్పించి ఆ స్థానంలో శ్రీ లీల ని తీసుకున్నారని వార్తలొస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి పుష్ప2 ఒక్కటే తన చేతిలో ఉందన్నమాట.

అయితే ఈ సినిమాలో రష్మిక చనిపోతుందంటూ ఎప్పట్నుంచో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ, ఈ సినిమా విజయం పైనే రష్మిక తెలుగు కెరీర్ ఆధారపడి ఉందని తెలుస్తుంది. అదీ గాక ఆ సినిమాలో రష్మిక కి సుకుమార్ మంచి ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే దానిద్వారా ఈ భామకి నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్స్ కూడా దొరకవచ్చు. ఇక ప్రస్తుతం అనిమల్ చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్న రష్మిక అది పూర్తవగానే పుష్ప2 సెట్స్ లో అడుగుపెడుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు