Tamannah : ఈ రెండింట్లోనూ తనకి ఇంపార్టెన్స్ లేదా?

Tamannaah has no importance

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన తమన్నా ఇప్పుడు ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించిన ఈ భామకి ఇప్పుడు మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో కూడా ఛాన్సులు రావట్లేదు. అయితే తాజాగా తమన్నా ఇద్దరు సౌత్ సూపర్ స్టార్ హీరోల సినిమాల్లో హీరోగా నటించిన విషయం తెలిసిందే. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ కాగా, మరొకటి సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్.

అయితే ఈ రెండు సినిమాలకి సంబంధించి ట్రైలర్ల ద్వారా ఓ క్లారిటీ వచ్చింది. భోళా శంకర్ లో హీరోయిన్ గా నటించిన తమన్నాకి సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఆ సినిమా సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కింది కాబట్టి, చిరు, కీర్తి ల మధ్యే ఎక్కువ బాండింగ్ ఉంటుందని తెలుస్తుంది. పైగా తమన్నా పాటలకే పరిమితమయ్యే రోల్ చేసిందని ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. ఇక తాజాగా జైలర్ లో కూడా తమన్నా పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో అసలు తమన్నాయే లేదు. పైగా సీనియర్ నటి రమ్యకృష్ణ రజినీకాంత్ వైఫ్ క్యారెక్టర్ లో నటించారు కాబట్టి, తమన్నా కి ఇందులో హీరోయిన్ రోల్ ఇవ్వలేదని తెలుస్తుంది. ఇక ఒక్క పాటలో తప్ప ఇంకెక్కడా తమన్నా ప్రస్తావన లేదు కాబట్టి జైలర్ లో కూడా తనకి ఇంపార్టెన్స్ లేదని తెలిసిపోతుంది. కాబట్టి ఈ రెండు సినిమాలు ఆడినా, ఆడకపోయినా తమన్నాకి ఒరిగేదేమి లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి చూడాలి ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత తమన్నా కి ఎలాంటి ఆఫర్లు వస్తాయో.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు