Jailer: ఈ సీనియర్ హీరోలకి వేరే హీరోయిన్లే దొరకలేదా?

సినిమా ఇండస్ట్రీ లో హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో మూడు దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీని ఏలిన హీరోలు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్. తెలుగులో చిరంజీవి, తమిళ్ లో రజినీకాంత్ తమ సినిమాలతో ఎన్నో ఏళ్ళు అలరించిన హీరోలు వయసు మీద బడుతున్నా అదే ఎనర్జీ తో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటించిన భోళా శంకర్, రజినీకాంత్ జైలర్ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

అయితే ఈ రెండు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఇరు హీరోల అభిమానులకు అస్సలు నచ్చలేదు. అదే హీరోయిన్ సెలక్షన్. జైలర్, భోళా శంకర్ ఈ రెండు సినిమాల్లో తమన్నా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు హీరోలకి హీరోయిన్ గా తమన్నా అస్సలు సెట్ కాలేదని కామన్ ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో తమన్నా వారి పక్కన ఎలా చూసినా కూతురులా అనిపిస్తుంది తప్ప ఒక హీరోయిన్ గా అస్సలు సెట్ కాదని తెలుస్తూనే ఉంది. పైగా తమన్నా వీళ్ళ కూతుళ్ళ కన్నా చిన్నది. ఇక రిలీజ్ అయిన పాటలు, టీజర్లలో కూడా అంతగా అట్ట్రాక్ట్ చేయలేదు. ఈ హీరోయిన్ కాకుండా సీనియర్ హీరోయిన్లైన త్రిష, నయనతార, అనుష్క కనీసం ప్రియమణి లాంటి వాళ్ళనైనా హీరోయిన్ గా తీసుకోనుండాల్సిందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పటికే షూటింగ్ పూర్తైపోయిన ఈ సినిమాల్లో మార్చడం కుదరదు. కాబట్టి ఇక ముందు రాబోయే సినిమాల్లోనైనా సీనియర్ హీరోయిన్లను తీసుకుంటే మంచిదని నెటిజన్లు అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు