Anand devarakonda : బేబీ కాంబినేషన్ లో మరో సినిమా.. ?

ఇటీవలనే థియేటర్స్ లో రిలీజై, విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న బేబీ సినిమా కాంబినేషన్ మళ్ళీ తొందరలోనే రిపీట్ అవ్వబోతుందట. అయితే ఈ విషయం,ఎవరో చెప్పింది. స్వయంగా బేబీ సినిమా తీసిన మేకర్సే మీడియా ముఖంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన బేబీ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించగా, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కెఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యూత్ కు బాగా ఎక్కేసింది. బేబీ సినిమా కోసం గాను మూవీ టీం ముందు నుంచి ప్రమోషన్స్ గట్టిగ చేయడం మూలాన సినిమా రిలీజైన మొదటి రోజే దాదాపు బ్రేక్ ఈవెన్ చేరువగా కలెక్షన్స్ వచ్చాయి. దానికి తోడు వీకెండ్ కూడా కలిసి రావడంతో బేబీ సినిమా షోలు ఇంకా పెరుగుతూ, బాక్స్ ఆఫీస్ వద్ద మంచి నంబర్స్ ను నమోదు చేస్తున్నాయి.

- Advertisement -

అయితే ఈ సినిమా సక్సెస్ ను సెలెబ్రేట్ చేస్తూ ఇటీవలనే నిర్వహించిన థాంక్యూ మీట్ లో డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ ఎస్కెఎన్ ప్రొడ్యూసర్ గా తాను ఇంకో సినిమా చేయబోతున్నట్టు మీడియాకి చెప్పాడు.

సాధారణంగా తనకు దర్శకత్వం మీద ఎక్కువ ఇష్టం ఉన్న కూడా ప్రొడ్యూసర్ ఉండటమే తనకు కంఫర్టబుల్ గా ఉందని ఆయన చెబుతూ, కానీ తన స్నేహితుడైన ఎస్కెఎన్ కు ఇచ్చిన మాటా కోసం మాత్రం తన నెక్స్ట్ సినిమా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే చేయబోతున్నట్టు చెప్పాడు. ఆ తర్వాత మరో సినిమా చేసి ఇక డైరెక్షన్ పక్కన పెట్టి కేవలం ప్రొడ్యూసర్ గా మాత్రమే వ్యవహరిస్తానని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే సాయి రాజేష్ రాబోయే సినిమాలో కూడా బేబీ తారాగణమే ఉండబోతుందని టాక్.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు