Siva kartikeyan: మహావీరుడు 2డేస్ కలెక్షన్స్.. డీసెంట్ స్టార్ట్

టాలీవుడ్ లో ఈ వారం మూడు సినిమాలు రిలీజ్ కాగా, అందులో ఒకటి తెలుగు సినిమా బేబి కాగా, మరో రెండు తమిళ్ డబ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక అందులో మంచి క్రేజీ అంచనాలతో విడుదలైన సినిమా “మహావీరుడు”. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటించగా, అదితి శంకర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా జులై14 న విడుదలై యావరేజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.

అయితే ఈ సినిమాలో కామెడీ బాగుండడంతో బీసీ సెంటర్ల ప్రేక్షకులు థియేటర్లలో బాగా ఆదరిస్తున్నారు. అయితే భారీ బిజినెస్ చేసిన ఈ సినిమా పలు సినిమాల పోటీ వలన డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. తమిళ్ లో మామన్నన్ పోటీ వలన అక్కడ ఎక్కువ భారీ ఓపెనింగ్స్ రాలేదు, కానీ సినిమాకున్న హైప్ ని బట్టి బాగానే వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో బేబీ సినిమా ఇంపాక్ట్ బాగా దెబ్బ తీసింది.

మహావీరుడు సినిమా ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 77లక్షల గ్రాస్ వసూలు చేయగా, రెండో రోజు 90లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఓవరాల్ గా రెండు రోజులు కలిపి 1.67 కోట్ల గ్రాస్ రాబట్టగా, వర్త్ షేర్ 80 లక్షలు ఉంటుంది. ఇక మహావీరుడు బిజినెస్ పరంగా భారీగా చేసినా, అందులో మేజర్ తమిళ్ లోనే అని తెలిసిందే. ఇక తెలుగు వెర్షన్ కి గాను మహావీరుడు 4.50 కోట్ల బిజినెస్ చేయగా 5కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయింది. అయితే వచ్చిన రెండు రోజుల కలెక్షన్స్ తీసేస్తే ఇంకా 4.20 కోట్లు రావాలి. ఇది జరగడం చాలా కష్టమే. ఇక ఆదివారం వీకెండ్ లో ఈ సినిమా మరింత జోరు చూపించే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు