Kamal hasan : శంకర్ మామూలోడు కాదు భయ్యా- ఇండియన్ 2 ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్

జీనియస్ ఫిలిం మేకర్ శంకర్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది సినిమా, సినిమాకు డైరెక్టర్ గా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ, ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్ ఇవ్వడంలో ముందుండే శంకర్ ఆయన లేటెస్ట్ సినిమా అయిన ఇండియన్ 2 లో మరో కొత్త ప్రయోగం చేయడానికి రెడీ అయ్యాడు.

ఒక్క సినిమా తీయడానికి కనీసం ఒకటి నుంచి రెండు సంవత్సరాలు సమయం తీసుకునే శంకర్ ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చెంజర్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న శంకర్. ఈ సినిమాతో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ ఇండియన్2 సినిమా గతంలో ఆయన డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా తొందర్లోనే విడుదల అవ్వబోతుంది.

- Advertisement -

అయితే ఈ సినిమాకి గాను శంకర్ ఒక కొత్త రకమైన ఎక్స్ పీరిమెంట్ చేయడానికి రెడీ అయ్యాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది . భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ తో పాటు ప్రధాన పాత్రలలో నటించిన కమెడియన్ వివేక్ మరియు నడిముడి వేణు లు ఇటీవలనే కాలం చెల్లించారు.

అయితే భారతీయుడు సినిమాలో వీరిద్దరూ కీలక పాత్రను పోషించడం వల్ల వీరి రోల్ ప్రస్తుతం ఇండియన్ 2 లో కూడా ఉండవలసిన ఆవశ్యకత ఏర్పడింది. దీనికోసం ఏకంగా శంకర్ ఈ ఇద్దరు యాక్టర్స్ ను సి.జి ద్వారా రీక్రియెట్ చేయనున్నడట. సాధారణంగానే సి.జి లో తన మాస్టర్ మైండ్ ను ఉపయోగించి అద్భుతాలు సృష్టించే శంకర్ ఇప్పుడు ఏకంగా చనిపోయిన ఈ ఇద్దరు నటులకు జీవం పోసి, స్క్రీన్ పై తీసుకొచ్చి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నాడు. ఇలాంటి వినూత్నమైనఐడియాస్ తో ఆయన సినిమాలు తీయడం వల్లనే ఈరోజుకు కూడా ఆయన సినిమాలకు క్రేజ్ తగ్గడం లేదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు