Box office: బేబీ 2డేస్ కలెక్షన్స్.. మాములు రచ్చ కాదిది

టాలీవుడ్ లో బేబీ జోరు కొనసాగుతుంది. చిన్న సినిమా అయినా పెద్ద సెలెబ్రెటీలతో హై ప్రమోషన్లతో ఆకట్టుకోవడం వల్ల ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కాయి. అయితే బేబీ రిలీజ్ అయిన తర్వాత అంత మంచి రెస్పాన్స్ రాలేదన్నది వాస్తవం. కానీ కాలేజ్ యూత్ ని అట్ట్రాక్ట్ చేయడం వల్ల ఈ సినిమా భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంది. పెద్ద సినిమాల లెవెల్లో ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా సిటీ ఏరియాల్లో , మల్టీప్లెక్స్ లలో దుమ్మురేపుతుంది.

అన్ని అంచనాలను దాటిపోయిన ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 6.55 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తాజాగా బేబీ రెండో రోజు కల్లెక్షన్లు వచ్చాయి. వచ్చిన టాక్ ని బట్టి రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లు డల్ అయిపోయాయని అనుకున్నారు అందరు. కానీ కాలేజ్ యూత్ అండతో ఈ సినిమా భీభత్సమైన కలెక్షన్లు సాధించింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.60cr వసూలు చేయగా, రెండో రోజు ఏకంగా 2.98cr వసూలు చేసింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో 5.58 కోట్ల షేర్ ని, 9.80 కోట్ల గ్రాస్ ని రాబట్టిన బేబీ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా 7.04 కోట్ల షేర్ ని 13.30కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక కేవలం 8 కోట్ల బిజినెస్ చేసిన బేబీ మూడో రోజుతో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. మరి ఓవరాల్ కలెక్షన్స్ ఎండ్ అయ్యే సరికి ఎంత వసూలు చేస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు