BABY : రష్మిక కు ఆమె ఎక్స్- లవర్ గుర్తొచ్చాడా ?

ఇటీవలనే రిలీజైన బేబీ చూసిన రష్మిక మందన్న ఈ సినిమాపై ట్వీట్ వేసి స్పందించింది. దాంతో నెటిజన్లంతా ఆమె పై నెగిటివ్ కామెంట్స్ చేస్తుండగా, ప్రస్తుతం ఆ పోస్ట్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. అయితే కేవలం ట్వీట్ చేయడం పై నెగిటివ్ కామెంట్స్ ఏంటని అందరికి అనుమానం రావచ్చు, నిజానికి ఈ నెగిటివ్ కామెంట్స్ ట్వీట్ వేసినందుకు కాదు.

రష్మిక- విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి ఎంత సన్నిహితురాలో అందరికి తెలిసిందే. గీత గోవిందం సినిమాతో మంచి ఫ్రెండ్స్ అయిన విజయ్ – రష్మిక లు ప్రేమించుకుంటున్నారని ఎన్నో రూమర్స్ వస్తోన్న కూడా అలాంటివేం పట్టించుకోకుండా రష్మిక- విజయ్ – ఆనంద్ దేవరకొండ మంచి ఫ్రెండ్స్ గా ఉంటున్నఅందరికి విధితమే.

అయితే ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా బేబీ విజయవంతంగా థియేటర్స్ లో ప్రదర్శింపబడుతూ ప్రేక్షకులను అలరిస్తున్న క్రమంలో నేషనల్ క్రష్ రష్మిక కూడా ఈ సినిమా చూసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా చూసాక తనకెలా అనిపించిందో ట్విట్ పెట్టి తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంది. గతంలో కూడా బేబీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఒక సాంగ్ కూడా రిలీజ్ చేయగా, లేటెస్ట్ గా ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

- Advertisement -

“బేబీ సినిమా చూసాను, సినిమాలో కొన్ని సీన్స్ చూసి నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. బేబీ టీమ్‌కి నా అభినందనలు” అని ఆమె ట్వీట్ చేయగా, కామెంట్స్ లో అంత రష్మిక కు బేబీ సినిమా చూసిన తరువాత ఆమెకు తన పాత లవరైన రక్షిత్ శెట్టి గుర్తొచ్చాడనుకుంట అందుకే అంత ఎమోషనల్ అయినదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బేబీ సినిమా ఫస్ట్ లవ్ గురించి ఉండటం వల్ల, రష్మిక మొదటి లవరైన రక్షిత్ శెట్టి గుర్తొచ్చా డంటూ ద్వందార్థం వచ్చేలా కామెంట్స్ ఉండటంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు