Baby: ఓపెనింగ్స్ రావాలంటే బడ్జెట్ కాదు. మార్కెటింగ్ ముఖ్యం

టాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా చిన్న సినిమాల హవానే నడుస్తుందని తెలిసిందే. మొన్న బలగం, నిన్న మేం ఫేమస్, నేడు సామజవరగమన. ఈ సినిమాల్లో భారీ తారాగణం, హై బడ్జెట్ లేకపోయినా కంటెంట్ వల్ల మౌత్ టాక్ తో మంచి హిట్ అయ్యాయి. అయితే కొన్ని సినిమాల్లో పెద్దగా కంటెంట్ లేకపోయినా సరే మార్కెటింగ్ వల్ల భారీ ఓపెనింగ్స్ సాధించి సేఫ్ అయిపోయాయి.

ఇప్పుడు అలాంటి సినిమాయే ఒకటి వచ్చింది. అదే “బేబీ” సినిమా. టాలీవుడ్ లో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మిక్సిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. సినిమా రిలీజ్ కి ముందు ఈ భారీగా మార్కెటింగ్ చేసారు చిత్ర యూనిట్. ఫస్ట్ లుక్ టీజర్ తో ఇంప్రెస్స్ చేయగా, ఆ తర్వాత పాటలతో మెప్పించి, ట్రైలర్ సెలెబ్రెటీలతో లాంచ్ చేయించి నానా హడావిడి చేసారు. విజయ్ దేవరకొండ లాంటి సెలబ్రిటీ లతో ప్రమోట్ చేసారు ఈ సినిమాని. ఫలితంగా బేబీ బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ సాధించింది. సినిమాకి అయిన బిజినెస్ లో ఫస్ట్ డే నే సగం రికవరీ చేసింది.

ఇక దీనికంటే ముందు రిలీజ్ అయిన మేం ఫేమస్ సినిమా కూడా చాలా మంది సెలబ్రిటీలతో మార్కెటింగ్ చేసారు. అందువల్ల సినిమాకి రొటీన్ టాకే వచ్చినా మంచి కలెక్షన్లు సాధించింది. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన శాకుంతలం, ఏజెంట్ లాంటి సినిమాలు ఎందుకు డిజాస్టర్స్ అయ్యాయో ఈ చిన్న సినిమాలు ఎందుకు సక్సెస్ అయ్యాయో, జరిగిన పరిణామాలను గమనిస్తే మేకర్స్ కి తెలిసిపోతుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

అయితే ఈ స్ట్రాటజీ అన్ని సినిమాలకి వర్తించదని నిర్మాతలు గ్రహించాలి. ఎందుకంటే ఈ సినిమాలు భారీ ప్రమోషన్లు చేసి, పోటీ లేని సమయంలో రిలీజ్ చేసారు. అందువల్ల ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు