Rangasthalam: జపాన్ లో 2023 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన రామ్ చరణ్ సినిమా..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రంగస్థలం చిట్టిబాబు గా రామ్ చరణ్ అద్భుత నట విశ్వరూపం చూపించిన సినిమా ఇది. 2018 లో విడుదలైన ఈ సినిమా ఆరోజుల్లోనే నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 227కోట్లకి పైగా వసూలు చేసిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా, ఆడియన్స్ కి క్యూల్స్ క్లాసిక్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇప్పుడు జపాన్ లోను డబ్ అయ్యి రిలీజ్ అయింది.

జులై14 న విడుదలైన ఈ సినిమాకు కెజిఎఫ్ రెండు పార్ట్ ల రిలీజ్ వల్ల లిమిటెడ్ స్క్రీన్స్ లభించాయి. అయినప్పటికీ రంగస్థలం భారీ ఓపెనింగ్స్ తో కుమ్మేసింది. కెజిఎఫ్ చాప్టర్1, 2 రెండిటికీ కలిపి 1.6 మిలియన్ జపాన్ యెన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగగా, రంగస్థలం సినిమాకి 2.5 మిలియన్ యెన్స్ బుకింగ్స్ జరిగాయి. అంటే కెజిఎఫ్ రెండు భాగాల కంటే కూడా రంగస్థలం కే ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయన్నమాట. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి రెస్పాన్స్ ని దక్కించుకోగా, లాంగ్ రన్ లో మంచి కలెక్షన్లు వసూలు చేస్తుందని అంటున్నారు.

ఇక రంగస్థలం సినిమా 2023 లో జపాన్ లో రిలీజ్ అయిన సినీమాల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచిందని చిత్ర యూనిట్ అఫిషియల్ గా ప్రకటించడం జరిగింది. ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ కలెక్షన్లు సాధించి అక్కడ టాప్ 5 మూవీస్ లో ఒకటి గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. జపాన్ లో RRR మూవీ మొదటి స్థానంలో ఉండగా, ముత్తు, బాహుబలి2, త్రీడియట్స్, ఇంగ్లీష్ వింగ్లిష్ ఆ తర్వాతి స్దానాల్లో నిలిచాయి. ఇక రంగస్థలం సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ని బట్టి థియేటర్స్ సంఖ్య పెంచే పనిలో ఉన్నారు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు