Sunny leone : అభిమానుల కోసమే వాటిల్లో నటించ.. సన్నీ లియోన్ హాట్ కామెంట్స్

సన్నీలియోన్.. అడల్ట్ కంటెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ఈ ముద్దుగుమ్మ. భారతీయ మూలాలు ఉన్న సన్నీలియోన్ కెనడాకు చెందిన పోర్న్ స్టార్. ఓ సిక్కు ఫ్యామిలీలో పుట్టిన సన్నిలియోన్ పోర్న్ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించింది. వరల్డ్ టాప్ పోర్న్ స్టార్స్ లో ఒకరిగా ఆమె వెలుగొందింది. దాదాపు 37 అడల్ట్ కంటెంట్ సినిమాలు తీసిన సన్నీ లియోన్ దర్శకురాలిగా, నిర్మాతగా కూడా పనిచేశారు. ఇక ఈ అసభ్యకర చిత్రాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ బాట పట్టింది ఈ ముద్దుగుమ్మ. 2012లో బాలీవుడ్ లో అడుగు పెట్టింది.

గత దశాబ్ద కాలంగా సన్నీలియోన్ పలుభాషల్లో చిత్రాలు చేస్తోంది. ఇక టాలీవుడ్ లో సైతం మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. ఆ తరువాత రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన గరుడవేగ చిత్రంలో స్పెషల్ సాంగ్ తో కుర్రకారుని ఓ ఊపు ఊపింది. ఇక ఇటీవల మంచు విష్ణు జిన్నా చిత్రంతో మరోసారి పలకరించింది. అయితే ఈమె 16 ఏళ్ల వయసులోనే మొదటిసారి తన వర్జినిటీని కోల్పోయానని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పూర్తిగా అడల్ట్ చిత్రాలకు పరిమితమైంది.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నీ తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. తాను పోర్న్ స్టార్ గా ఎంత కష్టపడి పని చేసినప్పటికీ ప్రయోజనం పొందలేదని తెలిపింది. అవన్నీ ఎంత కష్టమైనప్పటికీ అభిమానుల కోసమే చేశానని తెలిపింది. తనకు కోట్లలో అభిమానులు ఉన్నారని, వారి కోసమే ఆ చిత్రాలు చేశానని చెప్పుకొచ్చింది. కానీ ప్రస్తుతం అవన్నింటినీ వదిలేసి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. ప్రస్తుతం సన్నీ తమిళ్, మలయాళ, హిందీ భాషలలో కలిపి అరడజను వరకు సినిమాలు చేస్తోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు