Jailer: డబ్బులిస్తే ఎలాంటి పాత్రలైనా చేస్తుందా?

తమన్నా భాటియా తన జోరు చూపిస్తుంది. సీనియర్ హీరోయిన్ అయినా ఇప్పుడు అరడజను సినిమా ఆఫర్లతో దూసుకుపోతుంది. ఒక సంవత్సరం కిందటి వరకు ఛాన్సుల కోసం కొట్టుమిట్టాడిన ఈ భామ ఇప్పడు అన్ని రకాల సినిమాలు చేస్తూనే పలు యాడ్లు, వెబ్ సిరీస్ లలోను నటిస్తుంది. ఇక ఇప్పటికే తెలుగులో భోళా శంకర్ లో నటిస్తున్న ఈ మిల్క్ బ్యూటీ.. నాగార్జున రాబోయే సినిమాలోను ఆఫర్ కొట్టేసినట్టు వార్తలు వినబడుతున్నాయి.

అయితే ఒకప్పుడు అందరు టాప్ హీరోలతోనూ ఆడిపాడిన ఈ భామకి ఇప్పుడు సీనియర్ హీరోలే దిక్కయ్యారు. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది. చూడ్డానికి ఓవర్ వైట్ లాగా కనిపించే తమన్నా సీనియర్ల పక్కన అంతగా సూట్ కాదనేది వాస్తవం. ముఖ్యంగా చిరంజీవి, రజినీకాంత్ ల పక్కన అస్సలు సూట్ కాకపోగా, వారి పక్కన నిల్చుంటే వారి కూతురుగా కనిపిస్తుంది తప్ప హీరోయిన్ అన్న ఫీల్ రావట్లేదు.

కానీ తమన్నా అలాంటివేమీ పట్టించుకోకుండా అందరు సీనియర్లతోను జత కడుతుంది. పైగా రెమ్యూనరేషన్ కూడా 3కోట్లకి పైగానే తీసుకుంటుంది. ఇప్పటికే చిరు ,రజిని, వెంకీ లతో ఆడిపాడగా త్వరలోనే బాలయ్య, నాగ్, కమల్ సినిమాలోనూ ఆఫర్లు అందుకోనుంది. ఇక సినిమాల్లోనే కాక పలు వెబ సిరీస్ లోనూ నటిస్తూ బిజీగా ఉంది తమన్నా. రీసెంట్ గా లస్ట్ స్టోరీస్ సిక్వెల్ లో బోల్డ్ క్యారెక్టర్ కూడా వేస్తున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

ఇదిగాక జీ ఖర్దా అనే వెబ్ సిరీస్ లో కూడా అలంటి పాత్ర చేసినట్టు వార్తలు వినబడుతున్నాయి. మరి డబ్బులిస్తే తమన్నా ఎలాంటి పాత్ర చేయడానికైనా దిగజారుతుందా అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక తమన్నా సీనియర్ హీరోలతో నటిస్తూ వేరే సినిమాల్లో అలాంటి పాత్రలు చేయడం కరెక్ట్ కాదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి తమన్నా ఇప్పుడైనా కొంచెం అప్డేట్ అయ్యి సీనియర్ల తో చేస్తున్నప్పుడు డీసెంట్ గా అదే పాత్రల్ని సెలెక్ట్ చేసుకుంటే మంచిదని, లేదంటే వారి సినిమాల్లోనూ ఆఫర్లు రావని నెటిజన్లు అంటున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు