Prashanth varma: హనుమాన్ రిలీజ్ డేట్ లాక్- మరో ఆదిపురుష్ అవుతుందా ?

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ్ సజ్జ హీరోగా వస్తోన్న హనుమాన్ సినిమా రిలీజ్ డేట్ ఎట్టకేలకు కన్ఫామ్ అయింది. ఈ సమ్మర్ బిగినింగ్ లోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ కారణంగా వాయిదా పడి, సమ్మర్ రేస్ నుంచి తప్పుకుంది.

రామాయణ ఇతిహాసంలో అత్యంత బలశాలి, నమ్మిన వాళ్ళ కోసం ఎంత రిస్క్ అయిన చేసే హనుమంతుడి పాత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. గతంలో ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని రిలీజ్ చేయగా, ప్రేక్షకుల దగ్గరి నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక అప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు పెరిపోయాయి.

ఇటీవలనే ఒక ఇంటర్యూలో పాల్గొన్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాలో 1600 వరకు విఎఫ్ఎక్స్ షాట్స్ ఉండటం కారణంగా సినిమా రిలీజ్ ఆలస్యమవుతుందని తొందరలోనే ప్రేక్షకులు ముందుకి వస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనుకున్నదానికంటే విఎఫ్ఎక్స్ షాట్స్ తొందరగానే రావడంతో రిలీజ్ డేట్ ని లాక్ చేసింది మూవీ టీం.

- Advertisement -

అయితే ఈ సినిమాని వచ్చే ఆగస్టు 25న ప్రేక్షకుల తీసుకురాబోతున్నట్టు టాక్. ఈ విషయానికి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ని జులై మొదటి వారంలో పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించనున్నారు.

ఈ మధ్యనే రిలీజైన ఆదిపురుష్ సినిమా కూడా రామాయణం ఆధారంగా తెరకెక్కి , విమర్శలపాలు అవుతుండటంతో హనుమాన్ సినిమాని ఇంకా ఇంకా ఊరించి లాభం లేదని గ్రహించిన హనుమాన్ మూవీ టీం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెల్సుతుంది.

ఈ సినిమాలో తేజ్ సజ్జ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా, వర లక్ష్మి శరత్ కుమార్, వినయ్ వర్మ ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get the latest Tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు